అటుగాన శరణంటి నపరాధము లెందుకు
(॥పల్లవి॥)
అటుగాన శరణంటి నపరాధము లెందుకు
తటుకున బ్రదికించి దయఁ జూడవే
(॥అటు॥)
యెంచరాని నేరములు యిన్నిఁ జేసి యేలికకు
వంచనతో మొక్కితే భావము గరఁగు
పొంచి పొంచి వెగటుగాఁ బోరినవాఁడై నాను
మంచిమాట లాడితే సమ్మతి హితుఁ డౌను
(॥అటు॥)
ఆనాజ్ఞ దోసినట్టే యాతఁడైనా యేలికకు
కానిక చేతి కిచ్చితేఁ గురుణ వుట్టు
మోసముతో సొమ్మెల్లా ముచ్చిలించి తిని వచ్చి
దీనతతో లెంక యైతే దిగులెల్లాఁ బోవును
(॥అటు॥)
వాలాయించి దూరుచేసి వచ్చియైనా యేలికెకు
వేళ గాచి కొలిచితే వేడుక పుట్టు
యీలీల శ్రీవేంకటేశ యేజాతివాఁ డైనాను
మూల నీముద్ర మోచితే మునుపే రక్షింతువు
(||pallavi||)
aḍugāna śharaṇaṁṭi nabarādhamu lĕṁdugu
taḍuguna bradigiṁchi dayam̐ jūḍave
(||aḍu||)
yĕṁcharāni neramulu yinnim̐ jesi yeligagu
vaṁchanado mŏkkide bhāvamu garam̐gu
pŏṁchi pŏṁchi vĕgaḍugām̐ borinavām̐ḍai nānu
maṁchimāḍa lāḍide sammadi hidum̐ ḍaunu
(||aḍu||)
ānājña dosinaṭṭe yādam̐ḍainā yeligagu
kāniga sedi kichchidem̐ guruṇa vuṭṭu
mosamudo sŏmmĕllā muchchiliṁchi tini vachchi
dīnadado lĕṁka yaide digulĕllām̐ bovunu
(||aḍu||)
vālāyiṁchi dūrusesi vachchiyainā yeligĕgu
veḽa gāsi kŏliside veḍuga puṭṭu
yīlīla śhrīveṁkaḍeśha yejādivām̐ ḍainānu
mūla nīmudra moside munube rakṣhiṁtuvu