అటుగాన పతితోడ నలుగకు నీవు
(॥పల్లవి॥)
అటుగాన పతితోడ నలుగకు నీవు
కుటిలుఁడుగాఁ డతని గుణ మెరుఁగుదును
(॥అటు॥)
వలచినకాంత తనవల్లభుఁడు రాకుండితే
తలపోయుచుండుఁ గాని తప్పు లెంచదు
పలుమారు నాతఁ డెంతపరాకై వుండినాను
కొలువులు సేసుఁగాని కోపగించదు
(॥అటు॥)
అతిరాజసాన మాటలాడ వెరచి వుండితే
తతి గాచుకుండుఁ గాని తత్తరించదు
మతిఁ దనవారని మందెమేళాన నుండినా
యితవే నెరవుఁ గాని యీసడించదు
(॥అటు॥)
తరితీపు సిగ్గుతోడఁ దప్పక చూడకుండినా
సరసము లాడుఁ గాని సాదించదు
సిరులలమేల్‌మంగవు శ్రీవేంకటేశుఁ డతఁడు
సరి నీవంటిది గూడీ చలము సేయదు
(||pallavi||)
aḍugāna padidoḍa nalugagu nīvu
kuḍilum̐ḍugām̐ ḍadani guṇa mĕrum̐gudunu
(||aḍu||)
valasinagāṁta tanavallabhum̐ḍu rāguṁḍide
talaboyusuṁḍum̐ gāni tappu lĕṁchadu
palumāru nādam̐ ḍĕṁtabarāgai vuṁḍinānu
kŏluvulu sesum̐gāni kobagiṁchadu
(||aḍu||)
adirājasāna māḍalāḍa vĕrasi vuṁḍide
tadi gāsuguṁḍum̐ gāni tattariṁchadu
madim̐ danavārani maṁdĕmeḽāna nuṁḍinā
yidave nĕravum̐ gāni yīsaḍiṁchadu
(||aḍu||)
taridību siggudoḍam̐ dappaga sūḍaguṁḍinā
sarasamu lāḍum̐ gāni sādiṁchadu
sirulalamelmaṁgavu śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu
sari nīvaṁṭidi gūḍī salamu seyadu