Adugaana neegu mokke mamganam jegonavayya

అటుగాన నీకు మొక్కే మంగనఁ జేకొనవయ్య
Language

(॥పల్లవి॥)
అటుగాన నీకు మొక్కే మంగనఁ జేకొనవయ్య
ఇటునటు మాపు దాఁకా నేమి చెప్పే మిఁకను

(॥అటు॥)
తరుణి యెంత విరహతాపమునఁ బొరలినా
మరుసంకల్పానఁ గాని మట్టుపడదు
మరుని నేమిందరము మరి వేఁడుకొనేమంటే
సరుసకు నీవు రాక చందము గాదు

(॥అటు॥)
ఆరామ నిన్నెంత పెండ్లాడే నని తలఁచినా
కోరి బ్రహ్మవ్రాఁతఁ గాని కూటమి లేదు
పేరుకొని బ్రహ్మకుఁ బ్రియము చెప్పేమంటే
నీరాక గలితేఁగాని నెరవేర నేరదు

(॥అటు॥)
అలమేలుమంగ యెంత అట్టె కాఁగిలించేనన్నా
జలధి ధారవోయక సంగతి గాదు
జలధిని వేఁడుకొంటే సారె మామాటాలకించి
యేలమి శ్రీవేంకటేశ యేలుకొంటి వీకెను

(||pallavi||)
aḍugāna nīgu mŏkke maṁganam̐ jegŏnavayya
iḍunaḍu mābu dām̐kā nemi sĕppe mim̐kanu

(||aḍu||)
taruṇi yĕṁta virahadābamunam̐ bŏralinā
marusaṁkalbānam̐ gāni maṭṭubaḍadu
maruni nemiṁdaramu mari vem̐ḍugŏnemaṁṭe
sarusagu nīvu rāga saṁdamu gādu

(||aḍu||)
ārāma ninnĕṁta pĕṁḍlāḍe nani talam̐sinā
kori brahmavrām̐tam̐ gāni kūḍami ledu
perugŏni brahmagum̐ briyamu sĕppemaṁṭe
nīrāga galidem̐gāni nĕravera neradu

(||aḍu||)
alamelumaṁga yĕṁta aṭṭĕ kām̐giliṁchenannā
jaladhi dhāravoyaga saṁgadi gādu
jaladhini vem̐ḍugŏṁṭe sārĕ māmāḍālagiṁchi
yelami śhrīveṁkaḍeśha yelugŏṁṭi vīgĕnu