అటుగాన నీపాదాల కన్నియు విన్నవించితి
(॥పల్లవి॥)
అటుగాన నీపాదాల కన్నియు విన్నవించితి
తటుకునఁ దెలుసుకో తగినట్టు నీవు
(॥అటు॥)
నంటున నీమోము చూచి నవ్వులు వచ్చీనాకు
సొంటులు సోదిం చద్దముచూచుకోరాదా
ఇంటిలో తననేరమి యెఱఁగరాదు తనకు
కంటకమై యెదిరికిఁ గానవచ్చుఁగాని
(॥అటు॥)
వింతైననీమాట విని వెరగయ్యీ నాకైతే
అంతయు వద్దిచెలుల నడుగరాదా
దొంతినే తనకల్లలు తోఁచవుతనకెపుడు
వంతుల దగవు చెప్పేవారికిఁగాని
(॥అటు॥)
తరితీపునారతులు తలఁపయ్యీ నాకైతే
సురతపునీచదువు చూచుకోరాదా
గరిమ నలమేలుమంగను శ్రీవేంకటేశ నీ
వరుదై నన్నేలితివి యాపె నేలరాదా
(||pallavi||)
aḍugāna nībādāla kanniyu vinnaviṁchidi
taḍugunam̐ dĕlusugo taginaṭṭu nīvu
(||aḍu||)
naṁṭuna nīmomu sūsi navvulu vachchīnāgu
sŏṁṭulu sodiṁ saddamusūsugorādā
iṁṭilo tananerami yĕṟam̐garādu tanagu
kaṁṭagamai yĕdirigim̐ gānavachchum̐gāni
(||aḍu||)
viṁtainanīmāḍa vini vĕragayyī nāgaide
aṁtayu vaddisĕlula naḍugarādā
dŏṁtine tanagallalu tom̐savudanagĕbuḍu
vaṁtula dagavu sĕppevārigim̐gāni
(||aḍu||)
taridībunāradulu talam̐payyī nāgaide
suradabunīsaduvu sūsugorādā
garima nalamelumaṁganu śhrīveṁkaḍeśha nī
varudai nannelidivi yābĕ nelarādā