Adugaana balimi seyamgaraadu ramanuni

అటుగాన బలిమి సేయఁగరాదు రమణుని
Language

(॥పల్లవి॥)
అటుగాన బలిమి సేయఁగరాదు రమణుని
యెటువలెనైనాను యిచ్చకమే మేలు

(॥అటు॥)
చనవుగలకొలఁదే సరసాలు
ననిచినకొలఁదే నగవులు
వినయముకొలఁదే వేడుకలెల్లా పట్టి
పెనఁగరా దింతులకు ప్రియునితోను

(॥అటు॥)
మన్ననకొలఁదివే మాటలు
సన్నలకొలఁదివే సంగాతాలు
అన్నిటా మెచ్చుకొలఁదే ఆదరింపులు పతిని
మిన్నక కొసరరాదు మెలుఁతలకు

(॥అటు॥)
చుట్టరికము కొలఁదే సొలపులు
పట్టినకొలఁదినే పంతములు
అట్టె శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
ఱట్టుగా నన్నేలితి వాఱడి సేయరాదు

(||pallavi||)
aḍugāna balimi seyam̐garādu ramaṇuni
yĕḍuvalĕnainānu yichchagame melu

(||aḍu||)
sanavugalagŏlam̐de sarasālu
nanisinagŏlam̐de nagavulu
vinayamugŏlam̐de veḍugalĕllā paṭṭi
pĕnam̐garā diṁtulagu priyunidonu

(||aḍu||)
mannanagŏlam̐dive māḍalu
sannalagŏlam̐dive saṁgādālu
anniḍā mĕchchugŏlam̐de ādariṁpulu padini
minnaga kŏsararādu mĕlum̐talagu

(||aḍu||)
suṭṭarigamu kŏlam̐de sŏlabulu
paṭṭinagŏlam̐dine paṁtamulu
aṭṭĕ śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
ṟaṭṭugā nannelidi vāṟaḍi seyarādu