Adu ganaganem dannu naumgaadanam galanaa

అటు గనకనేఁ దన్ను నౌఁగాదనఁ గలనా
Language

(॥పల్లవి॥)
అటు గనకనేఁ దన్ను నౌఁగాదనఁ గలనా
నటనఁ దన కరుణే నాకు వలెఁ గాకా

(॥॥)
దొంతులైన మోహములు తోదోపు లాడఁగాను
పంతము లాడవచ్చునా పడఁతులకు
మంతనాన నాతఁడు మన్నించి చేయి వట్టితే
వింతలుగా మొక్కితేనే వేడుకలౌఁ గాక

(॥॥)
వెనుకొనీ మనసే వేడుకలు రేఁచఁగాను
పెనఁగు లాడవచ్చునా ప్రియురాండ్లకు
ననుపున నాతఁడు నా తోడ నవ్వితేను
వినయానఁ దనబుద్ది వినవలేఁగాక

(॥॥)
కగ్గు లేక యాదరించి కౌఁగిలించుకొనఁగాను
సిగ్గులు వడవచ్చునా చెలులకును
అగ్గమై శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను
యెగ్గు లేక నన్నుఁ గూడె నిరవైతిఁ గాకా

(||pallavi||)
aḍu ganaganem̐ dannu naum̐gādanam̐ galanā
naḍanam̐ dana karuṇe nāgu valĕm̐ gāgā

(||||)
dŏṁtulaina mohamulu todobu lāḍam̐gānu
paṁtamu lāḍavachchunā paḍam̐tulagu
maṁtanāna nādam̐ḍu manniṁchi seyi vaṭṭide
viṁtalugā mŏkkidene veḍugalaum̐ gāga

(||||)
vĕnugŏnī manase veḍugalu rem̐sam̐gānu
pĕnam̐gu lāḍavachchunā priyurāṁḍlagu
nanubuna nādam̐ḍu nā toḍa navvidenu
vinayānam̐ danabuddi vinavalem̐gāga

(||||)
kaggu lega yādariṁchi kaum̐giliṁchugŏnam̐gānu
siggulu vaḍavachchunā sĕlulagunu
aggamai śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
yĕggu lega nannum̐ gūḍĕ niravaidim̐ gāgā