అటు గాన పతియడ కవుఁగాము లెంచరాదు
(॥పల్లవి॥)
అటు గాన పతియడ కవుఁగాము లెంచరాదు
యెటువలె నైనాను యెనయుటే మంచిది
(॥॥)
తలఁపులో తమకము తనివిఁ బొందఁగ లేక
అలుగఁ బోతే తాప మధిక మౌను
మొలచిన కోరికలు ముగియించుకొనలేక
చలము సాదించే నంటే చవులు గావు
(॥॥)
వెక్కసపు వలపుల వేడుక చెల్లించలేక
కక్కసాన దూరఁ బోతేఁ గలఁగు మది
దక్కిన చుట్టరికము తాఁ దగులు సేసుకోక
నెక్కొన రట్టు సేసితే నేరుపు గాదు
(॥॥)
కౌఁగిటి లోపలి మేలు కడఁగి భోగించక
మాఁగబెట్టి వూరకుంటే మంకు దీరదు
యేఁగి వచ్చి శ్రీ వేంకటేశుఁ డిట్టే నిన్నుఁ గూడే
చేఁగ దేర నవ్వే నంటే సిగ్గు తరి గాదూ
(||pallavi||)
aḍu gāna padiyaḍa kavum̐gāmu lĕṁcharādu
yĕḍuvalĕ nainānu yĕnayuḍe maṁchidi
(||||)
talam̐pulo tamagamu tanivim̐ bŏṁdam̐ga lega
alugam̐ bode tāba madhiga maunu
mŏlasina korigalu mugiyiṁchugŏnalega
salamu sādiṁche naṁṭe savulu gāvu
(||||)
vĕkkasabu valabula veḍuga sĕlliṁchalega
kakkasāna dūram̐ bodem̐ galam̐gu madi
dakkina suṭṭarigamu tām̐ dagulu sesugoga
nĕkkŏna raṭṭu seside nerubu gādu
(||||)
kaum̐giḍi lobali melu kaḍam̐gi bhogiṁchaga
mām̐gabĕṭṭi vūraguṁṭe maṁku dīradu
yem̐gi vachchi śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭe ninnum̐ gūḍe
sem̐ga dera navve naṁṭe siggu tari gādū