Adiyunum joodamugaani aanadeevayyaa

అదియునుఁ జూతముగాని ఆనతీవయ్యా
Language

(॥పల్లవి॥)
అదియునుఁ జూతముగాని ఆనతీవయ్యా
కదిసేవు నాపై బత్తిగలదా నీకు

(॥అది॥)
చలపట్టి నాతోను జాణతనా లాడేవు
నెలకొన్న యీమోహము నిజమా నీకు
కలపుకోలు చేసుక కాఁగిలించుకోవచ్చేవు
చెలిమి యీడేర నిఁక సేసేవా నీవు

(॥అది॥)
విడువక నాతోను వేసరక నవ్వేవు
వుడివోకకూడేమన సున్న దా నీకు
అడరి నా మొగము నీ వాసపడి చూచేవు
బడిబడి నాతో నీవు పాయక వుండేవా

(॥అది॥)
నమ్మికలెల్లా నొసఁగి నన్నుఁ గడులాలించేవు
నెమ్మది నాయెడ దయ నిండెనా నీకు
యిమ్ముల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
కుమ్మరింపుఁగోర్కి దలకూడెనా నేఁడు

(||pallavi||)
adiyunum̐ jūdamugāni ānadīvayyā
kadisevu nābai battigaladā nīgu

(||adi||)
salabaṭṭi nādonu jāṇadanā lāḍevu
nĕlagŏnna yīmohamu nijamā nīgu
kalabugolu sesuga kām̐giliṁchugovachchevu
sĕlimi yīḍera nim̐ka sesevā nīvu

(||adi||)
viḍuvaga nādonu vesaraga navvevu
vuḍivogagūḍemana sunna dā nīgu
aḍari nā mŏgamu nī vāsabaḍi sūsevu
baḍibaḍi nādo nīvu pāyaga vuṁḍevā

(||adi||)
nammigalĕllā nŏsam̐gi nannum̐ gaḍulāliṁchevu
nĕmmadi nāyĕḍa daya niṁḍĕnā nīgu
yimmula śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
kummariṁpum̐gorgi dalagūḍĕnā nem̐ḍu