Adiyu neebhaagyamu avadharimtuvugaaga

అదియు నీభాగ్యము అవధరింతువుగాక
Language

(॥పల్లవి॥)
అదియు నీభాగ్యము అవధరింతువుగాక
వెదకి వచ్చేటివారే వేగినంతాను

(॥అది॥)
కాతరించి నీమోము గంటేఁజాలుఁగాని
చేతులు చాఁచేవారే చెలులెల్లాను
ఆతలనీతల నీవు అండకు వచ్చితేఁ జాలు
యేతుల నవ్వేవారే యేడనైనాను

(॥అది॥)
మక్కువ నోరుదెరచి మాట నీవాడితేఁచాలు
గక్కనఁ దిట్టేవారే కాంతలెల్లాను
చక్కనినీ వేపాటి సమ్మతించినాఁజాలు
యిక్కువ లంటేవారే యెవ్వరైనాను

(॥అది॥)
వలపులు చల్లుచు నీవు వావులు చెప్పితేఁ జాలు
అలరి పెండ్లాడేవారే అంగనలెల్లా
యెలమి శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
కలసేమనేవారే యేకాలమైనాను

(||pallavi||)
adiyu nībhāgyamu avadhariṁtuvugāga
vĕdagi vachcheḍivāre veginaṁtānu

(||adi||)
kādariṁchi nīmomu gaṁṭem̐jālum̐gāni
sedulu sām̐sevāre sĕlulĕllānu
ādalanīdala nīvu aṁḍagu vachchidem̐ jālu
yedula navvevāre yeḍanainānu

(||adi||)
makkuva norudĕrasi māḍa nīvāḍidem̐sālu
gakkanam̐ diṭṭevāre kāṁtalĕllānu
sakkaninī vebāḍi sammadiṁchinām̐jālu
yikkuva laṁṭevāre yĕvvarainānu

(||adi||)
valabulu sallusu nīvu vāvulu sĕppidem̐ jālu
alari pĕṁḍlāḍevāre aṁganalĕllā
yĕlami śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
kalasemanevāre yegālamainānu