(॥పల్లవి॥)
అదియె పో శ్రీహరినామము
తుదిపద మిదియె ధృవమై కలిగె
(॥అదియె॥)
తొడరి చిత్రకేతుఁడే నామము
తడవి లోకమంతయు గెలిచె
విడువక బ్రహ్మయు వెఁస నే నామము
బడిబడి నుడుగుచు ప్రభుడై నిలిచె
(॥అదియె॥)
హరుఁడే నామము అదె తారకముగ
నిరతిఁ దడవి యెన్నిక మీఱె
ధర నేనామము దలఁచి నారదుఁడు
సురమునియై సంస్తుతులకు నెక్కె
(॥అదియె॥)
ధృవుఁడేనామము దొరకొని నుతియించి
ధృవపట్టంబున తుద బ్రదికె
జవళి శ్రీ వేంకటేశ్వరుదాసు లెల్లాను
భువి నేనామము భోగించి మనిరి
(||pallavi||)
adiyĕ po śhrīharināmamu
tudibada midiyĕ dhṛvamai kaligĕ
(||adiyĕ||)
tŏḍari sitragedum̐ḍe nāmamu
taḍavi logamaṁtayu gĕlisĕ
viḍuvaga brahmayu vĕm̐sa ne nāmamu
baḍibaḍi nuḍugusu prabhuḍai nilisĕ
(||adiyĕ||)
harum̐ḍe nāmamu adĕ tāragamuga
niradim̐ daḍavi yĕnniga mīṟĕ
dhara nenāmamu dalam̐si nāradum̐ḍu
suramuniyai saṁstudulagu nĕkkĕ
(||adiyĕ||)
dhṛvum̐ḍenāmamu dŏragŏni nudiyiṁchi
dhṛvabaṭṭaṁbuna tuda bradigĕ
javaḽi śhrī veṁkaḍeśhvarudāsu lĕllānu
bhuvi nenāmamu bhogiṁchi maniri