Adiye kaadaa sadata maadanigi tana kibudu

అదియే కాదా సతత మాతనికి తన కిపుడు
Language

(॥పల్లవి॥)
అదియే కాదా సతత మాతనికి తన కిపుడు
పదియవస్థలఁ బొంగి భ్రమసేఁ గాక

(॥అది॥)
పతిఁ బాసి విరహమున పానుపే పామనుచు
అతివ యల్లన లేచి అవలి కేఁగె
సతి యంతలోఁ గొలన జలకేలి కేఁగి యది
మతిఁ బొంగుజలధనుచు మారుమో మిడియ

(॥అది॥)
తరుణి తామరయిల్లు తపనమండలమనుచు
అరమరచి కాఁకలనె యలసె నదివో
మరిగి మట్టెలరవము మంత్రశాస్త్రం బనుచు
వెరవెడలి తనలోనె వెరగందె నదివో

(॥అది॥)
చెలియ దనకుచగిరులు శ్రీవేంకటాచలపు-
నిలువుశిఖరములనుచు నిధుల నిలిచె
వలచి శ్రీవేంకటేశ్వరుఁ డపుడు గూడఁగా
తలఁపులును దనువులును తారుకాణాయ

(||pallavi||)
adiye kādā sadata mādanigi tana kibuḍu
padiyavasthalam̐ bŏṁgi bhramasem̐ gāga

(||adi||)
padim̐ bāsi virahamuna pānube pāmanusu
adiva yallana lesi avali kem̐gĕ
sadi yaṁtalom̐ gŏlana jalageli kem̐gi yadi
madim̐ bŏṁgujaladhanusu mārumo miḍiya

(||adi||)
taruṇi tāmarayillu tabanamaṁḍalamanusu
aramarasi kām̐kalanĕ yalasĕ nadivo
marigi maṭṭĕlaravamu maṁtraśhāstraṁ banusu
vĕravĕḍali tanalonĕ vĕragaṁdĕ nadivo

(||adi||)
sĕliya danagusagirulu śhrīveṁkaḍāsalabu-
niluvuśhikharamulanusu nidhula nilisĕ
valasi śhrīveṁkaḍeśhvarum̐ ḍabuḍu gūḍam̐gā
talam̐pulunu danuvulunu tārugāṇāya