అడియలాలెల్ల నిండె నంపరాదా । నీ
(॥పల్లవి॥)
అడియలాలెల్ల నిండె నంపరాదా । నీ-
నడిగినట్టెల్లానాయ నంపరాదా
(॥॥)
కన్నుల నిద్దుర దేరెఁ గందువలు చెమరించె
అన్నివనులును నాయ నంపరాదా
వన్నె మోవి కడురాఁగె వసివాడె మైఁదీగె
అన్నిటా జాణఁడవౌదు వంపరాదా
(॥॥)
కాయమెల్లా మఱపాయఁ గరఁగె నామనసెల్ల
ఆయములు సరిదాఁకె నంపరాదా
పాయములు ఫలమందె పంతము లొక్కట్లాయ
ఆయెడకే వత్తుఁగాని అంపరాదా
(॥॥)
మచ్చికలే తనివొందె మంతనాలే చవులాయ
అచ్చుపడెఁ గూటములు అంపరాదా
ఇచ్చకుఁడ శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితి-
వచ్చికములెల్లఁ బాసె నంపరాదా
(||pallavi||)
aḍiyalālĕlla niṁḍĕ naṁparādā | nī-
naḍiginaṭṭĕllānāya naṁparādā
(||||)
kannula niddura derĕm̐ gaṁduvalu sĕmariṁchĕ
annivanulunu nāya naṁparādā
vannĕ movi kaḍurām̐gĕ vasivāḍĕ maim̐dīgĕ
anniḍā jāṇam̐ḍavaudu vaṁparādā
(||||)
kāyamĕllā maṟabāyam̐ garam̐gĕ nāmanasĕlla
āyamulu saridām̐kĕ naṁparādā
pāyamulu phalamaṁdĕ paṁtamu lŏkkaṭlāya
āyĕḍage vattum̐gāni aṁparādā
(||||)
machchigale tanivŏṁdĕ maṁtanāle savulāya
achchubaḍĕm̐ gūḍamulu aṁparādā
ichchagum̐ḍa śhrī veṁkaḍeśha nannum̐ gūḍidi-
vachchigamulĕllam̐ bāsĕ naṁparādā