Adivo nee ramanumdu alugamgam dari gaadu

అదివో నీ రమణుఁడు అలుగఁగఁ దరి గాదు
Language

(॥పల్లవి॥)
అదివో నీ రమణుఁడు అలుగఁగఁ దరి గాదు
యెదిటికి రావు లోన నేమి సేసేవే

(॥ఆదివో॥)
చిలుక పావురము చెరకు శింగిణివిల్లు
వలరాజు దాడి ముట్టె వసంతవేళ
బలిమిఁ గోవిలకూఁత పరివారముల మోఁత
యెలమి నదివో లోన నేమి సేసేవే

(॥ఆదివో॥)
పొడవు మీను టెక్కెము పూవులయమ్ములపొది
వెడలె వరుఁడు దండు విరహులపై
యెడయని వెన్నలలు యెగయుఁ బౌఁజుల ధూళి
యిడమఁ జింతతో లోన నేమి సేసేవే

(॥ఆదివో॥)
చిగురుజొంపపు జల్లి చిరుతగాలి ప్రధాని
మగటిమిఁ గాముఁ డెక్కె మనసులపై
తగిన శ్రీవెంకంటాద్రి దైవ మిట్టె నన్నుఁ గూడె
యెగసక్కెమున లోన నేమి సేసేవే

(||pallavi||)
adivo nī ramaṇum̐ḍu alugam̐gam̐ dari gādu
yĕdiḍigi rāvu lona nemi seseve

(||ādivo||)
siluga pāvuramu sĕragu śhiṁgiṇivillu
valarāju dāḍi muṭṭĕ vasaṁtaveḽa
balimim̐ govilagūm̐ta parivāramula mom̐ta
yĕlami nadivo lona nemi seseve

(||ādivo||)
pŏḍavu mīnu ṭĕkkĕmu pūvulayammulabŏdi
vĕḍalĕ varum̐ḍu daṁḍu virahulabai
yĕḍayani vĕnnalalu yĕgayum̐ baum̐jula dhūḽi
yiḍamam̐ jiṁtado lona nemi seseve

(||ādivo||)
sigurujŏṁpabu jalli sirudagāli pradhāni
magaḍimim̐ gāmum̐ ḍĕkkĕ manasulabai
tagina śhrīvĕṁkaṁṭādri daiva miṭṭĕ nannum̐ gūḍĕ
yĕgasakkĕmuna lona nemi seseve