అదివో నీ దేవులు నీ యక్కునఁ జెలువొందీని
(॥పల్లవి॥)
అదివో నీ దేవులు నీ యక్కునఁ జెలువొందీని
యెదుట నీకు నాపె ఇన్నిటాఁ దగును
(॥అది॥)
భామ నీకు నేపొద్దు పరతంత్రము
అమనిరతులలో మోహనయంత్రము
దామెనపలుకుల మదనయంత్రము
సాముసేసేనీకాఁగిటి స్వతంత్రము
(॥అది॥)
నెలకొన్న నీకు మాణిక్యము
పొలసేచూపులకెల్లా పుష్పచాపము
కలిగె నీకింతటి శ్రింగారరూపము
యిల నీమహిమ వెలయించేప్రతాపము
(॥అది॥)
తన్నుదానే నీకును చిత్తరంజనము
నిన్నుఁ గూడేకళలతో నిరంజనము
యెన్పఁగ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
చెన్నగు నీవనేటినిక్షేపాన కంజనము
(||pallavi||)
adivo nī devulu nī yakkunam̐ jĕluvŏṁdīni
yĕduḍa nīgu nābĕ inniḍām̐ dagunu
(||adi||)
bhāma nīgu nebŏddu paradaṁtramu
amaniradulalo mohanayaṁtramu
dāmĕnabalugula madanayaṁtramu
sāmusesenīgām̐giḍi svadaṁtramu
(||adi||)
nĕlagŏnna nīgu māṇikyamu
pŏlasesūbulagĕllā puṣhpasābamu
kaligĕ nīgiṁtaḍi śhriṁgārarūbamu
yila nīmahima vĕlayiṁchepradābamu
(||adi||)
tannudāne nīgunu sittaraṁjanamu
ninnum̐ gūḍegaḽalado niraṁjanamu
yĕnpam̐ga śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
sĕnnagu nīvaneḍinikṣhebāna kaṁjanamu