అదివో లకిమమ్మ అహోబలేశ్వరుతోడ
(॥పల్లవి॥)
అదివో లకిమమ్మ అహోబలేశ్వరుతోడ
పదివేలు చందముల పరగీ రతులను
(॥అది॥)
సరుసనే కూచుండి జవళిఁ గొండలమీఁద
యిరులు చల్లులాడీ విభుఁడుఁదాను
పరిపరివిధముల భవనాశి దరులను
సరసములాడీని సాటికి చేటికిని
(॥అది॥)
యెదురుఁగాఁగిళ్ళతోడ నెనసి మాఁకులనీడ
పెదవితేనె లానీని ప్రేమమునను
నిదినిధానాలవలె నిచ్చ వానపడలను
సదమదమై నవ్వీని చతురత మెఱసి
(॥అది॥)
తొడఁదొడఁ గదియఁగ దోమటి గద్దెల నుండి
జడియక పెనఁగీని సమరతిని
యెడయక శ్రీవేంకటేశుఁడే నరసిఁహుఁడై
అడరఁగఁ బండ్లెడీ నతి సంతోసమున
(||pallavi||)
adivo lagimamma ahobaleśhvarudoḍa
padivelu saṁdamula paragī radulanu
(||adi||)
sarusane kūsuṁḍi javaḽim̐ gŏṁḍalamīm̐da
yirulu sallulāḍī vibhum̐ḍum̐dānu
paribarividhamula bhavanāśhi darulanu
sarasamulāḍīni sāḍigi seḍigini
(||adi||)
yĕdurum̐gām̐giḽḽadoḍa nĕnasi mām̐kulanīḍa
pĕdavidenĕ lānīni premamunanu
nidinidhānālavalĕ nichcha vānabaḍalanu
sadamadamai navvīni sadurada mĕṟasi
(||adi||)
tŏḍam̐dŏḍam̐ gadiyam̐ga domaḍi gaddĕla nuṁḍi
jaḍiyaga pĕnam̐gīni samaradini
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍe narasim̐hum̐ḍai
aḍaram̐gam̐ baṁḍlĕḍī nadi saṁtosamuna