Adivo kaasugunnaam dappadanumdi neevodda

అదివో కాచుకున్నాఁ డప్పటనుండి నీవొద్ద
Language

(॥పల్లవి॥)
అదివో కాచుకున్నాఁ డప్పటనుండి నీవొద్ద
పొదిగొన్న రతులను భోగించరాదా

(॥అది॥)
చలపాది తనమేల సాదింపు లిఁకనేల
పిలిచి పతిఁ గాఁగిట బెనఁగరాదా
మొలక సిగ్గులవేల ముసిముసి నవ్వులేల
తలిరుమోవి చూపి దప్పిదేర్చరాదా

(॥అది॥)
వట్టిగుట్లివియేల వాసి వంతు లింతయేల
వొట్టుక యీతని పాదాలొత్తఁగరాదా
చుట్టి చుట్టి యాడనేల సొలపు జంకెన లేల
చుట్టరికము గలయ సుద్దులు చెప్పరాదా

(॥అది॥)
తమకము దాఁచనేల తరితీపు సేయనేల
తిమురుచు నీవలపు తెలుపరాదా
అమరు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
మమతఁ గూడితి విట్టె మన్నింపించికోరాదా

(||pallavi||)
adivo kāsugunnām̐ ḍappaḍanuṁḍi nīvŏdda
pŏdigŏnna radulanu bhogiṁcharādā

(||adi||)
salabādi tanamela sādiṁpu lim̐kanela
pilisi padim̐ gām̐giḍa bĕnam̐garādā
mŏlaga siggulavela musimusi navvulela
talirumovi sūbi dappidersarādā

(||adi||)
vaṭṭiguṭliviyela vāsi vaṁtu liṁtayela
vŏṭṭuga yīdani pādālŏttam̐garādā
suṭṭi suṭṭi yāḍanela sŏlabu jaṁkĕna lela
suṭṭarigamu galaya suddulu sĕpparādā

(||adi||)
tamagamu dām̐sanela taridību seyanela
timurusu nīvalabu tĕlubarādā
amaru śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
mamadam̐ gūḍidi viṭṭĕ manniṁpiṁchigorādā