Adiva yegadinainaa nalasinaanu

అతివ యేగతినైనా నలసినాను
Language

(॥పల్లవి॥)
అతివ యేగతినైనా నలసినాను
యితవై కొన్నిటికైన యింపాయఁగా

(॥అతి॥)
మేఁ(మెం?)డైన విరహాన మెలుత కన్నులనీరు
నిండుగొలఁకులై నిగుడఁగాను
గండు మీలకైనాఁ గడు నందులోనుండి-
నొండొకటికిని దా నొకమన సవుగా

(॥అతి॥)
పరిపరివిధములఁ బానుపుపైఁ బొరలఁగా
శిరసుతురుము వీడి చెదరఁగను
నిరతి నలులకైనా నెలఁతమైవాసన
సరుసఁ గైకొనఁగ ముచ్చట దీరెఁగా

(॥అతి॥)
కడుఁగడుఁదమకాన కదిసి యింతలోనె
పడఁతి శ్రీవేంకటపతిఁ గూడఁగా
జడియుఁ బరవశాన సారెసారెకు మేన
యెడలేని పులకల కిరవాయఁగా

(||pallavi||)
adiva yegadinainā nalasinānu
yidavai kŏnniḍigaina yiṁpāyam̐gā

(||adi||)
mem̐(mĕṁ?)ḍaina virahāna mĕluda kannulanīru
niṁḍugŏlam̐kulai niguḍam̐gānu
gaṁḍu mīlagainām̐ gaḍu naṁdulonuṁḍi-
nŏṁḍŏgaḍigini dā nŏgamana savugā

(||adi||)
paribarividhamulam̐ bānububaim̐ bŏralam̐gā
śhirasudurumu vīḍi sĕdaram̐ganu
niradi nalulagainā nĕlam̐tamaivāsana
sarusam̐ gaigŏnam̐ga muchchaḍa dīrĕm̐gā

(||adi||)
kaḍum̐gaḍum̐damagāna kadisi yiṁtalonĕ
paḍam̐ti śhrīveṁkaḍabadim̐ gūḍam̐gā
jaḍiyum̐ baravaśhāna sārĕsārĕgu mena
yĕḍaleni pulagala kiravāyam̐gā