Adiva suddu lemi yadigevu mammu nimka

అతివ సుద్దు లేమి యడిగేవు మమ్ము నిఁక
Language

(॥పల్లవి॥)
అతివ సుద్దు లేమి యడిగేవు మమ్ము నిఁక
గతి నీవే వొనగూడి కరుణించవయ్యా

(॥అతి॥)
యింటికి వచ్చినదాఁకా నింతి నీ కెదురుచూచు
నంటునఁ గలయ సగినాలు చూచును
అంటి పలకపై వ్రాసి అట్టె నీరూపు చూచు
వొంటి నిన్నుఁ గాగిటిలో నున్నట్టు చింతించును

(॥అతి॥)
నెలతలఁ గనుఁగోంటే నీ వేళలే యడుగు
తలఁపులో మోవి యాని తనివిఁ బొందు
చెలులచే నీగుణాలు చిరునవ్వులతో విను
వలపుయాందోళాలు వడిఁ జెంగలించును

(॥అతి॥)
కోరి నీ వేలినదాఁకా గుబ్బలు నీకు మీఁదెత్తు
కూరిమి నీమన్ననకు గుట్టుతో మెచ్చు
యీరీతి శ్రీవేంకటేశ యీడ నీకె నేలితివి
సారె నీ చనవునకు సంతోసించి మొక్కును

(||pallavi||)
adiva suddu lemi yaḍigevu mammu nim̐ka
gadi nīve vŏnagūḍi karuṇiṁchavayyā

(||adi||)
yiṁṭigi vachchinadām̐kā niṁti nī kĕdurusūsu
naṁṭunam̐ galaya saginālu sūsunu
aṁṭi palagabai vrāsi aṭṭĕ nīrūbu sūsu
vŏṁṭi ninnum̐ gāgiḍilo nunnaṭṭu siṁtiṁchunu

(||adi||)
nĕladalam̐ ganum̐goṁṭe nī veḽale yaḍugu
talam̐pulo movi yāni tanivim̐ bŏṁdu
sĕlulase nīguṇālu sirunavvulado vinu
valabuyāṁdoḽālu vaḍim̐ jĕṁgaliṁchunu

(||adi||)
kori nī velinadām̐kā gubbalu nīgu mīm̐dĕttu
kūrimi nīmannanagu guṭṭudo mĕchchu
yīrīdi śhrīveṁkaḍeśha yīḍa nīgĕ nelidivi
sārĕ nī sanavunagu saṁtosiṁchi mŏkkunu