అతివ పాలి దేవుఁడ వన్నిటాను
(॥పల్లవి॥)
అతివ పాలి దేవుఁడ వన్నిటాను
నతులు సేసె నీకుఁ దగ మన్నించవయ్యా
(॥॥)
జలజాక్షికి నీ పేరు జపియించే మంత్రము
తలఁపులో నీ రూపుఁ సంతత ధ్యానము
అలరి చెలి నీ వద్ది కంపినదే ఆ వాహనము
వొలసి యచ్చువాసిన వురమే నీ పీఠము
(॥॥)
అంగపుఁ జిఱుఁ జెమట లర్ఘ్యపాద్యాచమనాలు
సంగతిఁ బెంజ మాటలె జలకములు
పొంగటఁ జల్లఁ గా మేనిపూఁత కుంకుమే గందము
చెంగటఁ గొప్పు విరులే సేసే పూజ నీకు
(॥॥)
నీరజాక్షి మోవితేనె నీకు నారగింపులు
యీ రీతిఁ బుక్కిటి వీడె లిచ్చె బాగాలూ
కూరిమి శ్రీ వేంకటేశ కూడితి వీకె నింతలో
సారపు సమరతులే సకలోపచారాలూ
(||pallavi||)
adiva pāli devum̐ḍa vanniḍānu
nadulu sesĕ nīgum̐ daga manniṁchavayyā
(||||)
jalajākṣhigi nī peru jabiyiṁche maṁtramu
talam̐pulo nī rūbum̐ saṁtada dhyānamu
alari sĕli nī vaddi kaṁpinade ā vāhanamu
vŏlasi yachchuvāsina vurame nī pīṭhamu
(||||)
aṁgabum̐ jiṟum̐ jĕmaḍa larghyabādyāsamanālu
saṁgadim̐ bĕṁja māḍalĕ jalagamulu
pŏṁgaḍam̐ jallam̐ gā menibūm̐ta kuṁkume gaṁdamu
sĕṁgaḍam̐ gŏppu virule sese pūja nīgu
(||||)
nīrajākṣhi movidenĕ nīgu nāragiṁpulu
yī rīdim̐ bukkiḍi vīḍĕ lichchĕ bāgālū
kūrimi śhrī veṁkaḍeśha kūḍidi vīgĕ niṁtalo
sārabu samaradule sagalobasārālū