Adiva ninne manina nadi yeggaa

అతివ నిన్నే మనిన నది యెగ్గా
Language

(॥పల్లవి॥)
అతివ నిన్నే మనిన నది యెగ్గా
చతురులైనవారికి చవులే కాదా

(॥అతివ॥)
కూరిమి గొసరఁగాను కోపముగాఁ జేసుకొంటే
యిరీతిఁ జెలుల కెల్లా నేది గతి
మేర మీరే నవ్వులకే మిక్కిలి బీరా లాడీతే
తారుకాణమోహలకు తగులాయ మేది

(॥అతివ॥)
చనవు మెరయ రాఁగా సారెకువేసారుకొంటే
వినయపుసతు లెల్ల వేగించు టెట్టు
కనుఁగొనలఁ జూడఁగ కాఁతాళాలు నెరపితే
ననుపుల లోపలికి నయగారా లేవి

(॥అతివ॥)
కుచ్చి కాఁగిలించుకోఁగా కుచములు నాటె నంటే
ముచ్చటాడేయింతులకు మొదలేది
యిచ్చికుఁడ శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
విచ్చనవిళ్లలోన విన్నవించ నేది

(||pallavi||)
adiva ninne manina nadi yĕggā
sadurulainavārigi savule kādā

(||adiva||)
kūrimi gŏsaram̐gānu kobamugām̐ jesugŏṁṭe
yirīdim̐ jĕlula kĕllā nedi gadi
mera mīre navvulage mikkili bīrā lāḍīde
tārugāṇamohalagu tagulāya medi

(||adiva||)
sanavu mĕraya rām̐gā sārĕguvesārugŏṁṭe
vinayabusadu lĕlla vegiṁchu ṭĕṭṭu
kanum̐gŏnalam̐ jūḍam̐ga kām̐tāḽālu nĕrabide
nanubula lobaligi nayagārā levi

(||adiva||)
kuchchi kām̐giliṁchugom̐gā kusamulu nāḍĕ naṁṭe
muchchaḍāḍeyiṁtulagu mŏdaledi
yichchigum̐ḍa śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
vichchanaviḽlalona vinnaviṁcha nedi