Adiva nee sittamu aadanibhaagyamu nemdu

అతివ నీ చిత్తము ఆతనిభాగ్యము నేఁడు
Language

(॥పల్లవి॥)
అతివ నీ చిత్తము ఆతనిభాగ్యము నేఁడు
తతిఁ బేదవానికి నిధానము చేరుటలు

(॥అతివ॥)
నిండురాజసపు నీనివ్వెరగుపాటె పో
కొండవంటిపతిమది కొల్లగొనెను
అండ నిందుమీఁద నేపాటైన నీవు నవ్వితేను
నిండు చెఱకునఁ బండునిలుచుట గాదా

(॥అతివ॥)
కడు నీమురిపెములకడకన్నుల చూపు వో
బడిబడి విభునిఁ దాపము రేఁచెను
యెడయ కిందుపై నీవు యేపాటి మాటలాడిన
వడి వాడినపైరుకు వానవచ్చినట్టు పో

(॥అతివ॥)
దగ్గరి కూచున్న నీతమక మిదియ పో
అగ్గమై శ్రీవేంకటేశు కనువాయను
నిగ్గుల నిందుమీఁద నీవె పైకొని కూడితి
బగ్గన బంగారానఁ బరిమళ మాయను

(||pallavi||)
adiva nī sittamu ādanibhāgyamu nem̐ḍu
tadim̐ bedavānigi nidhānamu seruḍalu

(||adiva||)
niṁḍurājasabu nīnivvĕragubāḍĕ po
kŏṁḍavaṁṭibadimadi kŏllagŏnĕnu
aṁḍa niṁdumīm̐da nebāḍaina nīvu navvidenu
niṁḍu sĕṟagunam̐ baṁḍunilusuḍa gādā

(||adiva||)
kaḍu nīmuribĕmulagaḍagannula sūbu vo
baḍibaḍi vibhunim̐ dābamu rem̐sĕnu
yĕḍaya kiṁdubai nīvu yebāḍi māḍalāḍina
vaḍi vāḍinabairugu vānavachchinaṭṭu po

(||adiva||)
daggari kūsunna nīdamaga midiya po
aggamai śhrīveṁkaḍeśhu kanuvāyanu
niggula niṁdumīm̐da nīvĕ paigŏni kūḍidi
baggana baṁgārānam̐ barimaḽa māyanu