అతివ లూరకుండరే ఆతఁడే నేనై వున్నదాన
(॥పల్లవి॥)
అతివ లూరకుండరే ఆతఁడే నేనై వున్నదాన
గతి యాతని పాదాలే కడమ లే దిఁకనూ
(॥॥)
యిచ్చినాఁడు సలిగలు యిన్నిటా నాతఁడు నాకు
కొచ్చి కూరిము లింకానుఁ గొసరుదురా
మెచ్చినాఁడు తొల్లి నా మిక్కుటపు సేవలకు
ముచ్చట నిప్పుడు రతి మొగచాటు సేతురా
(॥॥)
నవ్వినాఁడు వేడుకతో ననుపున నిందాఁక
చివ్వన నింకా మరి చెనకుదురా
పవ్వళించి నా చన్నులపైఁ జేయి చాఁచినాఁడు
వువ్విళ్ళూరి వట్టియాస లూరకే చల్లుదురా
(॥॥)
కూడినాఁడు సంతోసాన కుచ్చి నా కౌఁగిట నేఁడు
తోడనే సరసముల దొమ్మి సేతురా
యీడనే శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
జోడు వాయ కేలినాఁడు చుట్టి పెనఁగుదురా
(||pallavi||)
adiva lūraguṁḍare ādam̐ḍe nenai vunnadāna
gadi yādani pādāle kaḍama le dim̐kanū
(||||)
yichchinām̐ḍu saligalu yinniḍā nādam̐ḍu nāgu
kŏchchi kūrimu liṁkānum̐ gŏsarudurā
mĕchchinām̐ḍu tŏlli nā mikkuḍabu sevalagu
muchchaḍa nippuḍu radi mŏgasāḍu sedurā
(||||)
navvinām̐ḍu veḍugado nanubuna niṁdām̐ka
sivvana niṁkā mari sĕnagudurā
pavvaḽiṁchi nā sannulabaim̐ jeyi sām̐sinām̐ḍu
vuvviḽḽūri vaṭṭiyāsa lūrage salludurā
(||||)
kūḍinām̐ḍu saṁtosāna kuchchi nā kaum̐giḍa nem̐ḍu
toḍane sarasamula dŏmmi sedurā
yīḍane śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
joḍu vāya kelinām̐ḍu suṭṭi pĕnam̐gudurā