Adiva guttunanunna damdaamkaanu

అతివ గుట్టుననున్న దందాఁకాను
Language

(॥పల్లవి॥)
అతివ గుట్టుననున్న దందాఁకాను
చెతురుఁడ విఁకనైన సంగడి కేఁగరాదా

(॥అతి॥)
సేసకొప్పు వంచినది చెక్కుచేత మించినది
ఆసగా యేమాటయిన నాడరాదా
మూసిన ముత్యమయినది ముంగిటనిలుచున్నది
మేసుల ఆకెతోడ మేలమాడరాదా

(॥అతి॥)
నిట్టూర్పు నించినది నిండాఁజెమరించినది
నట్టుకొట్టి ఆకెఁ గొంత నవ్వించరాదా
మెట్టి నేల వ్రాసినది మేలు నీకుఁ జెప్పినది
వట్టి యాఁకె పానుపుపై పాలార్చరాదా

(॥అతి॥)
నివ్వెరెగుతో నున్నది నీమనసెల్లఁ గన్నది
రవ్వగా ఆకె నిట్టె రమ్మనరాదా
యివ్వల శ్రీ వేంకటేశ యింతసేసి కూడితివి
నివ్వటిల్లుఁ గోమలికి నిజమియ్యరాదా

(||pallavi||)
adiva guṭṭunanunna daṁdām̐kānu
sĕdurum̐ḍa vim̐kanaina saṁgaḍi kem̐garādā

(||adi||)
sesagŏppu vaṁchinadi sĕkkuseda miṁchinadi
āsagā yemāḍayina nāḍarādā
mūsina mutyamayinadi muṁgiḍanilusunnadi
mesula āgĕdoḍa melamāḍarādā

(||adi||)
niṭṭūrbu niṁchinadi niṁḍām̐jĕmariṁchinadi
naṭṭugŏṭṭi āgĕm̐ gŏṁta navviṁcharādā
mĕṭṭi nela vrāsinadi melu nīgum̐ jĕppinadi
vaṭṭi yām̐kĕ pānububai pālārsarādā

(||adi||)
nivvĕrĕgudo nunnadi nīmanasĕllam̐ gannadi
ravvagā āgĕ niṭṭĕ rammanarādā
yivvala śhrī veṁkaḍeśha yiṁtasesi kūḍidivi
nivvaḍillum̐ gomaligi nijamiyyarādā