అతిసులభుఁడవు నీ వవి నిన్నుఁ గొలిచి
(॥పల్లవి॥)
అతిసులభుఁడవు నీ వవి నిన్నుఁ గొలిచి
తతి మేలే కొందుఁ గాని తప్పు మాకు లేదు
(॥అతి॥)
తిట్టే శిశుపాలనకు దివ్యపద మిచ్చితివి
ముట్టి కొలుచువారికి మోక్ష మియ్యవా
వెట్టి బండి రొప్పించిన విజయునిఁ గాచితివి
నెట్టిన నీ కింకరుల నీవు గావ కుందువా
(॥అతి॥)
తన్నినభృగువు నటు తగ సంతోషించితివి
అన్నిటాఁ బూజించువారి నాదరించవా
నిన్ను రోషిఁచు కాళింగు నెమ్మి గరుణించితివి
వున్నతిఁ గొల్చినవారి నొగిఁ గరుణించవా
(॥అతి॥)
అమ్ముమొనకుఁ జిక్కిన అంబుధి మొరాలించితి
నమ్మినవారిమాట వినవా నీవు
యిమ్ముల శ్రీవేంకటేశ యిఁక సరిలేదు నీకు
పమ్మి శరణాగతులఁ బాలించకుందువా
(||pallavi||)
adisulabhum̐ḍavu nī vavi ninnum̐ gŏlisi
tadi mele kŏṁdum̐ gāni tappu māgu ledu
(||adi||)
tiṭṭe śhiśhubālanagu divyabada michchidivi
muṭṭi kŏlusuvārigi mokṣha miyyavā
vĕṭṭi baṁḍi rŏppiṁchina vijayunim̐ gāsidivi
nĕṭṭina nī kiṁkarula nīvu gāva kuṁduvā
(||adi||)
tanninabhṛguvu naḍu taga saṁtoṣhiṁchidivi
anniḍām̐ būjiṁchuvāri nādariṁchavā
ninnu roṣhim̐su kāḽiṁgu nĕmmi garuṇiṁchidivi
vunnadim̐ gŏlsinavāri nŏgim̐ garuṇiṁchavā
(||adi||)
ammumŏnagum̐ jikkina aṁbudhi mŏrāliṁchidi
namminavārimāḍa vinavā nīvu
yimmula śhrīveṁkaḍeśha yim̐ka sariledu nīgu
pammi śharaṇāgadulam̐ bāliṁchaguṁduvā