Adiribaadu vachchi appude neevu

అదిరిపాటు వచ్చి అప్పుడే నీవు
Language

(॥పల్లవి॥)
అదిరిపాటు వచ్చి అప్పుడే నీవు
పదిమారులును యేల పంతాలాడేవే

(॥అద॥)
వలపు నిలువలేక వద్దనున్న చెలులతో
కలికితనాల నెంత కాఁతాళించేవే
బలువుఁడాతఁడు నీపై బత్తి చూచుకొంట గాక
సొలసి మలసి యేమి సోదించేవే

(॥అద॥)
విరహ మాఁపఁగలేక విభని మొగము చూచి
మరులుకొలిపి యేఁటిమాట లాడేవే
సరసుఁ డాతఁడిచ్చినచనవే చూచుట గాక
తిరిగి తిరిగి యెంత తెలుపవచ్చేవే

(॥అద॥)
మనసు వారించలేక మచ్చిక శ్రీవేంకటేశుఁ
బెనఁగి కాఁగిట నెంత బిగింయించేవే
నను నిట్టె యేలినాఁడు ననుపే చూచుటగా
పనిపడి యింకా నెంత పచారించేవే

(||pallavi||)
adiribāḍu vachchi appuḍe nīvu
padimārulunu yela paṁtālāḍeve

(||ada||)
valabu niluvalega vaddanunna sĕlulado
kaligidanāla nĕṁta kām̐tāḽiṁcheve
baluvum̐ḍādam̐ḍu nībai batti sūsugŏṁṭa gāga
sŏlasi malasi yemi sodiṁcheve

(||ada||)
viraha mām̐pam̐galega vibhani mŏgamu sūsi
marulugŏlibi yem̐ṭimāḍa lāḍeve
sarasum̐ ḍādam̐ḍichchinasanave sūsuḍa gāga
tirigi tirigi yĕṁta tĕlubavachcheve

(||ada||)
manasu vāriṁchalega machchiga śhrīveṁkaḍeśhum̐
bĕnam̐gi kām̐giḍa nĕṁta bigiṁyiṁcheve
nanu niṭṭĕ yelinām̐ḍu nanube sūsuḍagā
panibaḍi yiṁkā nĕṁta pasāriṁcheve