Adiraajasabuvaamdu annidaa daanu

అతిరాజసపువాఁడు అన్నిటా దాను
Language

(॥పల్లవి॥)
అతిరాజసపువాఁడు అన్నిటా దాను
సతులచేఁ జెప్పి పంపీ సారె వచ్చేనంటాను

(॥అతి॥)
చెలులతో మాటాడితే చిగురించు వలపులు
కలసిమెలసి వుంటే కాఁక రేఁగును
మలసి నవ్వు నవ్వితే మర్మములెల్లాఁ గరఁగు
వొలసి తా నింతేసి కోపఁగలఁడటనే

(॥అతి॥)
చెనకితేఁ జెమటలు చెలమలవలె నూరు
ననిచి మోము చూచితే నాటుఁ జిత్తము
పెనఁగితేఁ దమకము పెరుగుఁ గోటికొండలై
వొనరి యిట్టిపొందుల కోపఁగలఁడటవే

(॥అతి॥)
పొసఁగఁజేయి చాఁచితే పులకలు మోసులెత్తు
కొసరితే కోరికలు కుప్పలైనిండు
యెసఁగ శ్రీవేంకటేశుఁ డే నలమేలు మంగను
వొసపరై కూడె నింత కోపఁగలఁడటవే

(||pallavi||)
adirājasabuvām̐ḍu anniḍā dānu
sadulasem̐ jĕppi paṁpī sārĕ vachchenaṁṭānu

(||adi||)
sĕlulado māḍāḍide siguriṁchu valabulu
kalasimĕlasi vuṁṭe kām̐ka rem̐gunu
malasi navvu navvide marmamulĕllām̐ garam̐gu
vŏlasi tā niṁtesi kobam̐galam̐ḍaḍane

(||adi||)
sĕnagidem̐ jĕmaḍalu sĕlamalavalĕ nūru
nanisi momu sūside nāḍum̐ jittamu
pĕnam̐gidem̐ damagamu pĕrugum̐ goḍigŏṁḍalai
vŏnari yiṭṭibŏṁdula kobam̐galam̐ḍaḍave

(||adi||)
pŏsam̐gam̐jeyi sām̐side pulagalu mosulĕttu
kŏsaride korigalu kuppalainiṁḍu
yĕsam̐ga śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelu maṁganu
vŏsabarai kūḍĕ niṁta kobam̐galam̐ḍaḍave