అతిరాజసపువాఁడు ఆతఁడు దొల్లె
(॥పల్లవి॥)
అతిరాజసపువాఁడు ఆతఁడు దొల్లె
మతకమున నిన్నెంత మన్నించునో సుమ్మీ
(॥॥)
చిగురుల వేనేవు చెనకేవు కొనగోర
మగవానితో నెంతమారుకొనేవే
యెగసక్కేలకు నాతఁ డేమి సేసునో నిన్ను
ఇగురుఁబోడివి నేము యెఱఁగముసుమ్మీ
(॥॥)
చేరి పంతాలాడేవు చెయివట్టి పెనఁగేవు
సారెఁ బతితో నెంత చయ్యాటాలే
మారుకుమా రాతఁడు మరియెంత సాదించునో
నారీమణి యిందరిలో నగుఁబాటుసుమ్మీ
(॥॥)
జంకించేవు బొమ్మలను చలాలకే నవ్వేవు
యింక శ్రీ వేంకటేశుతో నింత యేఁటికే
అంకేల నిన్నాతఁ డేలె నటు వొంటిఁ జింక్కించుక
చింకచూపులాడి వీని చిత్తము సుమ్మీ
(||pallavi||)
adirājasabuvām̐ḍu ādam̐ḍu dŏllĕ
madagamuna ninnĕṁta manniṁchuno summī
(||||)
sigurula venevu sĕnagevu kŏnagora
magavānido nĕṁtamārugŏneve
yĕgasakkelagu nādam̐ ḍemi sesuno ninnu
igurum̐boḍivi nemu yĕṟam̐gamusummī
(||||)
seri paṁtālāḍevu sĕyivaṭṭi pĕnam̐gevu
sārĕm̐ badido nĕṁta sayyāḍāle
mārugumā rādam̐ḍu mariyĕṁta sādiṁchuno
nārīmaṇi yiṁdarilo nagum̐bāḍusummī
(||||)
jaṁkiṁchevu bŏmmalanu salālage navvevu
yiṁka śhrī veṁkaḍeśhudo niṁta yem̐ṭige
aṁkela ninnādam̐ ḍelĕ naḍu vŏṁṭim̐ jiṁkkiṁchuga
siṁkasūbulāḍi vīni sittamu summī