అతిరాజసపు విభుఁ డాతఁడు గదే
(॥పల్లవి॥)
అతిరాజసపు విభుఁ డాతఁడు గదే
రతి మెప్పింతువుగాక రవ్వసేయనేఁటికే
(॥అతి॥)
కలికతనాల మతిఁగరఁగింతువుగాక
సళుపుచుఁ బతినేల జంకించేవే
తలఁపులోనే మెలఁగి తమిరేఁతువుగాక
పెలుచుఁదనాల నేల పెనఁగులాడేవే
(॥అతి॥)
సరసతల వలపుచవి వుట్టింతువుగాక
వొరసి యాతనినేల వుప్పతించేవే
వరుసవంతులు చూపి వసపరతువుగాక
తెరదీసి మరియేల తేలించేవే
(॥అతి॥)
కాయజకేలినే నీవు కడుఁ జొక్కింతువుగాక
చాయల సన్నలనేల సాదించేవే
యీయెడ శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్నునేలె
చేయి మీఁదాయ నేల సిగ్గులు వెంచేవే
(||pallavi||)
adirājasabu vibhum̐ ḍādam̐ḍu gade
radi mĕppiṁtuvugāga ravvaseyanem̐ṭige
(||adi||)
kaligadanāla madim̐garam̐giṁtuvugāga
saḽubusum̐ badinela jaṁkiṁcheve
talam̐pulone mĕlam̐gi tamirem̐tuvugāga
pĕlusum̐danāla nela pĕnam̐gulāḍeve
(||adi||)
sarasadala valabusavi vuṭṭiṁtuvugāga
vŏrasi yādaninela vuppadiṁcheve
varusavaṁtulu sūbi vasabaraduvugāga
tĕradīsi mariyela teliṁcheve
(||adi||)
kāyajageline nīvu kaḍum̐ jŏkkiṁtuvugāga
sāyala sannalanela sādiṁcheve
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnunelĕ
seyi mīm̐dāya nela siggulu vĕṁcheve