Adiraajasabu dorayamtaa numtimi

అతిరాజసపు దొరయంటా నుంటిమి
Language

(॥పల్లవి॥)
అతిరాజసపు దొరయంటా నుంటిమి
రతిరాజవిద్యలకు రాజు గదవమ్మా

(॥అతి॥)
వలపు నిలుపలేక వచ్చినమగువరాక
తిలకించి చూచి దయదలఁచీఁ బతి
వలలఁ జిక్కినమగువలకు నీతఁ డెంత
సులభుఁడై వున్నాఁడు చూడరే వోయమ్మా

(॥అతి॥)
ఆసతోడ జవరాలు అట్టె జాణతనాలాడ
లాసి తానూ బత్తి గడుఁజేసిఁ బతి
సేసవెట్టినకాంతలు చెప్పినట్టెల్లా విని
చేసూటినే మెలఁగీని చెప్పఁ గొత్తలమ్మా

(॥అతి॥)
వాడికకాంతఁ దొలుతఁ గూడుక నన్నూ నేలె
వేడుకకాఁడు గదె శ్రీవేంకటపతి
జా డెరిఁగి వారివారి చనవులు చెల్లించి
తోడఁబెండ్లికొడుకై దొరసీ నోయమ్మా

(||pallavi||)
adirājasabu dŏrayaṁṭā nuṁṭimi
radirājavidyalagu rāju gadavammā

(||adi||)
valabu nilubalega vachchinamaguvarāga
tilagiṁchi sūsi dayadalam̐sīm̐ badi
valalam̐ jikkinamaguvalagu nīdam̐ ḍĕṁta
sulabhum̐ḍai vunnām̐ḍu sūḍare voyammā

(||adi||)
āsadoḍa javarālu aṭṭĕ jāṇadanālāḍa
lāsi tānū batti gaḍum̐jesim̐ badi
sesavĕṭṭinagāṁtalu sĕppinaṭṭĕllā vini
sesūḍine mĕlam̐gīni sĕppam̐ gŏttalammā

(||adi||)
vāḍigagāṁtam̐ dŏludam̐ gūḍuga nannū nelĕ
veḍugagām̐ḍu gadĕ śhrīveṁkaḍabadi
jā ḍĕrim̐gi vārivāri sanavulu sĕlliṁchi
toḍam̐bĕṁḍligŏḍugai dŏrasī noyammā