అడిగితే నేమనునో అడుగకున్నాఁ బోదు
(॥పల్లవి॥)
అడిగితే నేమనునో అడుగకున్నాఁ బోదు
వుడివోని తలఁపోఁత నున్న దేకారణమో
(॥అడిగి॥)
బంగారుమేడకంబము కౌఁగిలించి పట్టి
అంగన తా నిలుచున్న దప్పటనుండి
తొంగి చూచినమాతో మాటలాడ దిదే
అంగవించినట్టి పరా కది యెటువంటిదో
(॥అడిగి॥)
గోడలపై చిత్తరువు కోరి కోరి చూచుకొంటా
వాడుదేరి శిర సట్టే వంచి వంచి
వీడెము చేతి కిచ్చిన వెలఁది యందుకో దిదే
యేడ నున్నదో చిత్త మెన్నఁడు నెఱుఁగము
(॥అడిగి॥)
చేతిలోఁ దామెరపవ్వు చెలి గోర నెత్తుతాను
ఘాతఁ దన లోలోనే కరఁగఁగాను
యీతల శ్రీవేంకటేశుఁ డింతలో విచ్చేసి కూడె
చేతనె ఆతని మెచ్చీఁ జెలికే తెలుసును
(||pallavi||)
aḍigide nemanuno aḍugagunnām̐ bodu
vuḍivoni talam̐pom̐ta nunna degāraṇamo
(||aḍigi||)
baṁgārumeḍagaṁbamu kaum̐giliṁchi paṭṭi
aṁgana tā nilusunna dappaḍanuṁḍi
tŏṁgi sūsinamādo māḍalāḍa dide
aṁgaviṁchinaṭṭi parā kadi yĕḍuvaṁṭido
(||aḍigi||)
goḍalabai sittaruvu kori kori sūsugŏṁṭā
vāḍuderi śhira saṭṭe vaṁchi vaṁchi
vīḍĕmu sedi kichchina vĕlam̐di yaṁdugo dide
yeḍa nunnado sitta mĕnnam̐ḍu nĕṟum̐gamu
(||aḍigi||)
sedilom̐ dāmĕrabavvu sĕli gora nĕttudānu
ghādam̐ dana lolone karam̐gam̐gānu
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesi kūḍĕ
sedanĕ ādani mĕchchīm̐ jĕlige tĕlusunu