Adigaanani anugovaddu

అడిగానని అనుకోవద్దు
Year
Language

పల్లవి:

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

చరణం 1:

ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకుని మొక్కుతు ఉంటారెందుకు

అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు..
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ …

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

చరణం 2:

మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు

లోకులు చూచి తరించుటకు … లోకులు చూచి తరించుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు… పలుగాకుల బొజ్జల పెంచుటకు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

చరణం 3:

మహమ్మదీయులు పిలిచే దేవుడు .. క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా .. గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు ..వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు ..వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా

సర్వవ్యాపి నారాయణుడు ….సర్వవ్యాపి నారాయణుడు.. ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా .. తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా

ఆఁ అట్టా రండి దారికి …

అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు .. మీరొక్క దెబ్బతో తేల్చారు ..
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు ..మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు ..ఏ రాతికి మొక్కను వచ్చారు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

pallavi:

aḍigānani anugovaddu sĕppaguṁḍa dāḍĕyŏddu
emiḍī rahasyaṁ svāmī .. emiḍī visitraṁ
aḍigānani anugovaddu sĕppaguṁḍa dāḍĕyŏddu
emiḍī rahasyaṁ svāmī .. emiḍī visitraṁ

saraṇaṁ 1:

ŏkka rāyini kāligiṁdesi tŏkkudu uṁṭārĕṁdugu
iṁkŏkka rādigi sedulĕttuguni mŏkkudu uṁṭārĕṁdugu

adi vīdhilona paḍi unnaṁdugu .. adi vīdhilona paḍi unnaṁdugu..
idi guḍilo bŏmmai kūrsunnaṁdugū …

aḍigānani anugovaddu sĕppaguṁḍa dāḍĕyŏddu
emiḍī rahasyaṁ svāmī .. emiḍī visitraṁ

saraṇaṁ 2:

maniṣhigi ŏga pĕḽḽe sālaṁṭū devuḍu keḍeḍa pĕḽḽeṁdugu
ūrumīda paḍi saṁdālĕṁdugu
maniṣhigi ŏga pĕḽḽe sālaṁṭū devuḍu keḍeḍa pĕḽḽeṁdugu
ūrumīda paḍi saṁdālĕṁdugu

logulu sūsi tariṁchuḍagu … logulu sūsi tariṁchuḍagu
palugāgula bŏjjala pĕṁchuḍagu… palugāgula bŏjjala pĕṁchuḍagu

aḍigānani anugovaddu sĕppaguṁḍa dāḍĕyŏddu
emiḍī rahasyaṁ svāmī .. emiḍī visitraṁ

saraṇaṁ 3:

mahammadīyulu pilise devuḍu .. kraistavulaṁtā kŏlise devuḍu
eḍugŏṁḍala veṁkaḍeśhvaruḍu goviṁdā .. goviṁdā
śhrīśhailaṁlo malligārjunuḍu ..vārū vīrū ŏgaḍenā … veruverugā unnārā
śhrīśhailaṁlo malligārjunuḍu ..vārū vīrū ŏgaḍenā … veruverugā unnārā

sarvavyābi nārāyaṇuḍu ….sarvavyābi nārāyaṇuḍu.. ĕkkaḍa jūsina uṁṭāḍu
ā svāmi kŏragĕ ne śhodhistunnā .. tīrdhālannī tirugudu unnā

ām̐ aṭṭā raṁḍi dārigi …

akkaḍa ikkaḍa ĕkkaḍa sūsina devuḍu uṁṭāḍannāru .. mīrŏkka dĕbbado telsāru ..
akkaḍa ikkaḍa ĕkkaḍa sūsina devuḍu uṁṭāḍannāru ..mīrŏkka dĕbbado telsāru
ĕkkaḍa baḍide akkaḍa uṁṭe ikkaḍagĕṁdugu vachchāru ..e rādigi mŏkkanu vachchāru

aḍigānani anugovaddu sĕppaguṁḍa dāḍĕyŏddu
emiḍī rahasyaṁ svāmī .. emiḍī visitraṁ