Adi yevvade taanu alamelmamganu nenu

అది యెవ్వతె తాను అలమేల్మంగను నేను
Language

(॥పల్లవి॥)
అది యెవ్వతె తాను అలమేల్మంగను నేను
పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చేఁ గాని

(॥అది॥)
పొలఁతి నీ కెవ్వతె బుద్దులు చెప్పినది
నలుపున నాపతితో నవ్వుమంటాను
తెలుపఁగదవే దాని దీమస మెంతో
చలములో నీతో మరి సాదించేఁగాని

(॥అది॥)
నీ కెవ్వతె యీ చేఁతలు నేరిపినది
జోకతో నా రమణుని సాలయుమని
నాకుఁ జూపనే దాని విన్నాణ మెంతో
మైకొని నీతో మరి మాఁటలాడేఁగాని

(॥అది॥)
వోడక యెవ్వతె నీ కీ వుపదేశ మిచ్చినది
యీడ నాశ్రీవేంకటేశు నెనయుమని
వాడలో నెంచవే దాని వాసి యంతో యీతఁడు
కూడె నన్ను నీతో మరి గుట్టు చెప్పేఁగాని

(||pallavi||)
adi yĕvvadĕ tānu alamelmaṁganu nenu
pŏdigi dām̐saguve nī pūniga mĕchchem̐ gāni

(||adi||)
pŏlam̐ti nī kĕvvadĕ buddulu sĕppinadi
nalubuna nābadido navvumaṁṭānu
tĕlubam̐gadave dāni dīmasa mĕṁto
salamulo nīdo mari sādiṁchem̐gāni

(||adi||)
nī kĕvvadĕ yī sem̐talu neribinadi
jogado nā ramaṇuni sālayumani
nāgum̐ jūbane dāni vinnāṇa mĕṁto
maigŏni nīdo mari mām̐ṭalāḍem̐gāni

(||adi||)
voḍaga yĕvvadĕ nī kī vubadeśha michchinadi
yīḍa nāśhrīveṁkaḍeśhu nĕnayumani
vāḍalo nĕṁchave dāni vāsi yaṁto yīdam̐ḍu
kūḍĕ nannu nīdo mari guṭṭu sĕppem̐gāni