అది చూచి నాకు వేడుకాయను నేఁడు
(॥పల్లవి॥)
అది చూచి నాకు వేడుకాయను నేఁడు
యెదలోన నీ కప్పుడెట్టుండెనో కాని
(॥అది॥)
చెలిని చెవిలోపలఁ జేరి యేకతాలాడఁగ
పులకించె మేను గొబ్బున నీకును
మొలకనవ్వులు నీపై ముంచిముంచి చల్లఁగాను
జలజలఁ జెమరించె చక్కనినీచెక్కులు
(॥అది॥)
కోమలి నీకు లోనికొలువులు సేయఁగాను
ఆముకొనఁ జెంగలించె నదె నీమోము
కోమలపుచనుఁగవకొనలు దాఁకించఁగాను
ప్రేమతో మూపులు మూఁడై పెనగొనె నీకును
(॥అది॥)
వనిత యెదుటనుండి వలపులు రేఁచఁగాను
వొనర నీమర్మములు వుప్పొంగెను
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
పెనఁగి నీకాపెకుఁగా బెరసెను కళలు
(||pallavi||)
adi sūsi nāgu veḍugāyanu nem̐ḍu
yĕdalona nī kappuḍĕṭṭuṁḍĕno kāni
(||adi||)
sĕlini sĕvilobalam̐ jeri yegadālāḍam̐ga
pulagiṁchĕ menu gŏbbuna nīgunu
mŏlaganavvulu nībai muṁchimuṁchi sallam̐gānu
jalajalam̐ jĕmariṁchĕ sakkaninīsĕkkulu
(||adi||)
komali nīgu lonigŏluvulu seyam̐gānu
āmugŏnam̐ jĕṁgaliṁchĕ nadĕ nīmomu
komalabusanum̐gavagŏnalu dām̐kiṁcham̐gānu
premado mūbulu mūm̐ḍai pĕnagŏnĕ nīgunu
(||adi||)
vanida yĕduḍanuṁḍi valabulu rem̐sam̐gānu
vŏnara nīmarmamulu vuppŏṁgĕnu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
pĕnam̐gi nīgābĕgum̐gā bĕrasĕnu kaḽalu