అది నీకుఁ దారుకాణ అవునోకాదో కాని
(॥పల్లవి॥)
అది నీకుఁ దారుకాణ అవునోకాదో కాని
కదిసి చెప్పఁగబోతే కతలయ్యీఁ గాని
(॥అది॥)
కలలోని నీరూపు కన్నులఁగన్నట్లయ్యీ
చెలఁగి ఆసుద్ది చెప్పఁజింతయ్యీఁగాని
వెలయ నీపలుకులు వీనుల విన్నట్లయ్యీ
సెలవిఁ గమ్మరఁ జెప్పసిగ్గుయ్యీఁగాని
(॥అది॥)
మంతనాన నీతో మాట లాడినట్లయ్యా
అంతటఁ జూచితే వెరగయ్యీఁగాని
కంతునమరతి నిన్నుఁ గాఁగిలించినట్లయ్యీ
పంతాన నేమనినాను పచ్చిదేరీఁగాని
(॥అది॥)
సరుస నీమోవితేనె చవిగొన్నఅట్లనయ్యీ
వొరసి చూపఁబోతే గోరొత్తీఁగాని
ఇరవయినశ్రీవేంకటేశ నీవు ద్రిష్టముగా
సరుగఁ గూడిన నదె చాలాయఁగాని
(||pallavi||)
adi nīgum̐ dārugāṇa avunogādo kāni
kadisi sĕppam̐gabode kadalayyīm̐ gāni
(||adi||)
kalaloni nīrūbu kannulam̐gannaṭlayyī
sĕlam̐gi āsuddi sĕppam̐jiṁtayyīm̐gāni
vĕlaya nībalugulu vīnula vinnaṭlayyī
sĕlavim̐ gammaram̐ jĕppasigguyyīm̐gāni
(||adi||)
maṁtanāna nīdo māḍa lāḍinaṭlayyā
aṁtaḍam̐ jūside vĕragayyīm̐gāni
kaṁtunamaradi ninnum̐ gām̐giliṁchinaṭlayyī
paṁtāna nemaninānu pachchiderīm̐gāni
(||adi||)
sarusa nīmovidenĕ savigŏnnaaṭlanayyī
vŏrasi sūbam̐bode gorŏttīm̐gāni
iravayinaśhrīveṁkaḍeśha nīvu driṣhṭamugā
sarugam̐ gūḍina nadĕ sālāyam̐gāni