అది నీ పట్టపుదేవు లడిగితేఁ జెప్పితిమి
(॥పల్లవి॥)
అది నీ పట్టపుదేవు లడిగితేఁ జెప్పితిమి
యెదుట నేల దాఁచేవు యెఱిఁగిన పనికి
(॥॥)
వాలారు గోళ్ళు సోఁక వనితా నీవు సంగడిఁ
గేలుఁ గేలుఁ బెనచుక కేరి నవ్వరా
మేలిమి పొదరింటిలో మీ రిద్దరు నల్లప్పుడు
తాలిమి తోడ నేకతము లాడుకొనరా
(॥॥)
అక్కజపుఁ దమి తోడ నాపే నీవుఁ జెలరేఁగి
చెక్కుఁ జెక్కుఁ జేర్చి వావి చెప్పుకొనరా
మొక్కలానఁ జీఁకటి మూఁక మాఁకులలోన
అక్కరతో సరసము లాడుకొంటా నుండరా
(॥॥)
చిడిముడి నొండొరులు చిగురుఁ బానుపు మీఁద
తొడఁ దొడ నంటఁ గాలు దొక్కుకొనరా
కడు నేఁ డీకెఁ గూడితి గాక శ్రీ వేంకటేశ్వర
యెడయక తొల్లి సేఁతలెల్లాఁ జేసుకొనరా
(||pallavi||)
adi nī paṭṭabudevu laḍigidem̐ jĕppidimi
yĕduḍa nela dām̐sevu yĕṟim̐gina panigi
(||||)
vālāru goḽḽu som̐ka vanidā nīvu saṁgaḍim̐
gelum̐ gelum̐ bĕnasuga keri navvarā
melimi pŏdariṁṭilo mī riddaru nallappuḍu
tālimi toḍa negadamu lāḍugŏnarā
(||||)
akkajabum̐ dami toḍa nābe nīvum̐ jĕlarem̐gi
sĕkkum̐ jĕkkum̐ jersi vāvi sĕppugŏnarā
mŏkkalānam̐ jīm̐kaḍi mūm̐ka mām̐kulalona
akkarado sarasamu lāḍugŏṁṭā nuṁḍarā
(||||)
siḍimuḍi nŏṁḍŏrulu sigurum̐ bānubu mīm̐da
tŏḍam̐ dŏḍa naṁṭam̐ gālu dŏkkugŏnarā
kaḍu nem̐ ḍīgĕm̐ gūḍidi gāga śhrī veṁkaḍeśhvara
yĕḍayaga tŏlli sem̐talĕllām̐ jesugŏnarā