Adi naa bhaagyamegaaga aadamdemi sesune

అది నా భాగ్యమేకాక ఆతఁడేమి సేసునే
Language

(॥పల్లవి॥)
అది నా భాగ్యమేకాక ఆతఁడేమి సేసునే
అదనైనందాఁక నింతే ఆతఁడేమి సేసునే

(॥అది॥)
కలువకన్నులఁ జూచె ఘను డాతఁ డవె నాకు
అలరుబాణములై తే నతఁ డేమిసేసునే
పలుకుఁదేనెల నాతోఁ బలికె నవె నాకు
చిలుకుబాసటమైతే సేయుమనే దేమే

(॥అది॥)
వెన్నెలనవ్వులు నవ్వె విభుఁ డాతఁ డవె నాకు
నన్నువట్టియెండలై తే నాతఁ డేమిసేసునే
సన్నిధిఁ గప్రము చల్లె సరసపువేళ నాకు
నన్నిటాఁ జొక్కుమందైతే నాతఁ డేమిసేసునే

(॥అది॥)
కొంగువట్టి తీసి నన్నుఁ గూడె నాతఁ డది నాకు
నంగమెల్ల మఱిపంచె నాతఁ డేమిసేసునే
ఇంగితపుశ్రీవేంకటేశుఁడు మోహించఁగాను
అంగడి కెక్కె వలపు ఆతఁ డేమిసేసునే

(||pallavi||)
adi nā bhāgyamegāga ādam̐ḍemi sesune
adanainaṁdām̐ka niṁte ādam̐ḍemi sesune

(||adi||)
kaluvagannulam̐ jūsĕ ghanu ḍādam̐ ḍavĕ nāgu
alarubāṇamulai te nadam̐ ḍemisesune
palugum̐denĕla nādom̐ baligĕ navĕ nāgu
silugubāsaḍamaide seyumane deme

(||adi||)
vĕnnĕlanavvulu navvĕ vibhum̐ ḍādam̐ ḍavĕ nāgu
nannuvaṭṭiyĕṁḍalai te nādam̐ ḍemisesune
sannidhim̐ gapramu sallĕ sarasabuveḽa nāgu
nanniḍām̐ jŏkkumaṁdaide nādam̐ ḍemisesune

(||adi||)
kŏṁguvaṭṭi tīsi nannum̐ gūḍĕ nādam̐ ḍadi nāgu
naṁgamĕlla maṟibaṁchĕ nādam̐ ḍemisesune
iṁgidabuśhrīveṁkaḍeśhum̐ḍu mohiṁcham̐gānu
aṁgaḍi kĕkkĕ valabu ādam̐ ḍemisesune