Adi lessa telusugo appudu viduvaraadu

అది లెస్స తెలుసుకో అప్పుడు విడువరాదు
Language

(॥పల్లవి॥)
అది లెస్స తెలుసుకో అప్పుడు విడువరాదు
వెదకి నాపైఁ జేయివేసేవు నేఁడు

(॥అది॥)
వోపుదువా ఆపెతోను వొడ్డాఁ బెట్టా మాటలాడ
యీ పొద్దున మా ఇంటికి యెట్టు వచ్చితి
ఆఁపఁగలవా కోప మాపె నిన్ను జంకించితే
చూపుల నన్ను దప్పకచూచేవు నీవు

(॥అది॥)
సేయనోపుదువా ఆపె చేరి బాస సేయుమంటే
యీయెడ నా చనుఁగవ యిట్టె అంటేవు
నాయానకు రాఁగలవా నమ్మనంటే ఆపెతోను
చేయిమీఁదుగా నాపై సేసలు వెట్టేవు

(॥అది॥)
నిలువఁగనోపుదువా నేర మాపె యెంచితేను
కొలఁదిమీరఁగ నన్నుఁ గూడితివి
యెలమి నాపెకు పంతమియ్యకుండ గలవా
నలి శ్రీవేంకటేశుఁడ నవ్వేవు నాతోను

(||pallavi||)
adi lĕssa tĕlusugo appuḍu viḍuvarādu
vĕdagi nābaim̐ jeyivesevu nem̐ḍu

(||adi||)
vobuduvā ābĕdonu vŏḍḍām̐ bĕṭṭā māḍalāḍa
yī pŏdduna mā iṁṭigi yĕṭṭu vachchidi
ām̐pam̐galavā koba mābĕ ninnu jaṁkiṁchide
sūbula nannu dappagasūsevu nīvu

(||adi||)
seyanobuduvā ābĕ seri bāsa seyumaṁṭe
yīyĕḍa nā sanum̐gava yiṭṭĕ aṁṭevu
nāyānagu rām̐galavā nammanaṁṭe ābĕdonu
seyimīm̐dugā nābai sesalu vĕṭṭevu

(||adi||)
niluvam̐ganobuduvā nera mābĕ yĕṁchidenu
kŏlam̐dimīram̐ga nannum̐ gūḍidivi
yĕlami nābĕgu paṁtamiyyaguṁḍa galavā
nali śhrīveṁkaḍeśhum̐ḍa navvevu nādonu