Ade vamtashaalalona alamelumamganaamchaa

అదె వంటశాలలోన అలమేలుమంగనాంచా
Language

(॥పల్లవి॥)
అదె వంటశాలలోన అలమేలుమంగనాంచా-
రెదుట శ్రీవేంకటేశు కితవైనయట్లు

(॥అదె॥)
వెండిపైఁడిచట్లలో వేరె వేరె కూర లెల్ల
వండించి దొంతి వెట్టించి వద్ద నుండి
కొండలపొడవుగాఁగ కోటిబోనా లపరంజి
కుండలఁ గుమ్మరింపించి కొలువై కూచుండీ

(॥అదె॥)
పానకాలు శిఖరులు పటికంపఁ గొప్పెరల
పూని వాసనలుగాఁగ పువ్వు గట్టించి
వానినే నీలపుఁ జట్టువములనే నించి నించి
ఆనించుకొని వడ్డించ నాయత్తపడీని

(॥అదె॥)
అందాలు గల్లు రనఁగా నడుగులు పెట్టి పెట్టి
విందు లలమెలుమంగ వేళ వేళను
చెంది శ్రీవేంకటపతికి చేతులకుఁ గడిగడి
అందియిచ్చి పొత్తునఁ దా నారగించి నదివో

(||pallavi||)
adĕ vaṁṭaśhālalona alamelumaṁganāṁchā-
rĕduḍa śhrīveṁkaḍeśhu kidavainayaṭlu

(||adĕ||)
vĕṁḍibaim̐ḍisaṭlalo verĕ verĕ kūra lĕlla
vaṁḍiṁchi dŏṁti vĕṭṭiṁchi vadda nuṁḍi
kŏṁḍalabŏḍavugām̐ga koḍibonā labaraṁji
kuṁḍalam̐ gummariṁpiṁchi kŏluvai kūsuṁḍī

(||adĕ||)
pānagālu śhikharulu paḍigaṁpam̐ gŏppĕrala
pūni vāsanalugām̐ga puvvu gaṭṭiṁchi
vānine nīlabum̐ jaṭṭuvamulane niṁchi niṁchi
āniṁchugŏni vaḍḍiṁcha nāyattabaḍīni

(||adĕ||)
aṁdālu gallu ranam̐gā naḍugulu pĕṭṭi pĕṭṭi
viṁdu lalamĕlumaṁga veḽa veḽanu
sĕṁdi śhrīveṁkaḍabadigi sedulagum̐ gaḍigaḍi
aṁdiyichchi pŏttunam̐ dā nāragiṁchi nadivo