Ade raamumdu suvelaadribai nilise

అదే రాముఁడు సువేలాద్రిపై నిలిచె
Language

(॥పల్లవి॥)
అదే రాముఁడు సువేలాద్రిపై నిలిచె
యెదిరితివి సీత యిఁక నేమమ్మా

(॥అదే॥)
దనుజులు వారేరు తలఁకేరు లంకలో
వనజాప్తకులుఁడు వచ్చెనమ్మా
వినవచ్చెను కపివీరుల యార్పులు
వెనుకొని పవుఁజులు విడిసెనమ్మా

(॥అదే॥)
కదనములో కుంభకర్ణాది వీరులు
మదమున బయిపడి మడిసిరమ్మా
చిరుఁమగ రావణుచేతులుఁ దలలు
నిదులనెల్లా విన్ను నిండెనమ్మా

(॥అదే॥)
పతి విభీషుణునిఁ బట్టముగట్టెనమ్మా
అతఁడు నిన్నుఁ బిలువనంపీనమ్మా
కతగా శ్రీవేంకటగిరిమీఁదను
యితవుగఁ గూడరొ యిపుడేమమ్మా

(||pallavi||)
ade rāmum̐ḍu suvelādribai nilisĕ
yĕdiridivi sīda yim̐ka nemammā

(||ade||)
danujulu vāreru talam̐keru laṁkalo
vanajāptagulum̐ḍu vachchĕnammā
vinavachchĕnu kabivīrula yārbulu
vĕnugŏni pavum̐julu viḍisĕnammā

(||ade||)
kadanamulo kuṁbhagarṇādi vīrulu
madamuna bayibaḍi maḍisirammā
sirum̐maga rāvaṇusedulum̐ dalalu
nidulanĕllā vinnu niṁḍĕnammā

(||ade||)
padi vibhīṣhuṇunim̐ baṭṭamugaṭṭĕnammā
adam̐ḍu ninnum̐ biluvanaṁpīnammā
kadagā śhrīveṁkaḍagirimīm̐danu
yidavugam̐ gūḍarŏ yibuḍemammā