Ade nee peddarigame annidaanu

అదె నీ పెద్దరికమే అన్నిటాను
Language

(॥పల్లవి॥)
అదె నీ పెద్దరికమే అన్నిటాను
పొదిగి నీ కాఁగిటిలో బుజ్జగించవయ్యా

(॥॥)
బలిమిగలకాంతకు పట్టినదే పంతము
కలసి నీచెల్లుబడి గలిగితేను
యెలమి మందెమేళాన యేమి నిన్నుఁజేసీనో
వలచినాపెకును గర్వము దగునయ్యా

(॥॥)
సేసవెట్టినచెలికి సేసినదెల్లాఁ జేఁత
ఆనయిచ్చి నీవుగన ఆదరించితే
వాసితో నీచనవున వడి నేమేమాడెనో
నీసరినున్నాపెకు నిన్నేసి దగునయ్యా

(॥॥)
నెమ్మి నలమేల్మంగకు నిల్చినదే నిలుకడ
ఇమ్ముల నీవు శ్రీ వేంకటేశ కూడితే
వుమ్మడి నీరతి నెంతవొద్దిక నొరసెనో
తమ్మివిరిపై యాపె కింతయుఁ దగునయ్యా

(||pallavi||)
adĕ nī pĕddarigame anniḍānu
pŏdigi nī kām̐giḍilo bujjagiṁchavayyā

(||||)
balimigalagāṁtagu paṭṭinade paṁtamu
kalasi nīsĕllubaḍi galigidenu
yĕlami maṁdĕmeḽāna yemi ninnum̐jesīno
valasinābĕgunu garvamu dagunayyā

(||||)
sesavĕṭṭinasĕligi sesinadĕllām̐ jem̐ta
ānayichchi nīvugana ādariṁchide
vāsido nīsanavuna vaḍi nememāḍĕno
nīsarinunnābĕgu ninnesi dagunayyā

(||||)
nĕmmi nalamelmaṁgagu nilsinade nilugaḍa
immula nīvu śhrī veṁkaḍeśha kūḍide
vummaḍi nīradi nĕṁtavŏddiga nŏrasĕno
tammiviribai yābĕ kiṁtayum̐ dagunayyā