అద్దో యెక్కడి సుద్ది అంతేసి కోపఁగలనా
(॥పల్లవి॥)
అద్దో యెక్కడి సుద్ది అంతేసి కోపఁగలనా
గద్దించ నీతో నాకుఁ బెద్దరికమా
(॥అద్దో॥)
చెలఁగి నీవేమి చేసినాఁ జేసితివి గాక
చలములు సాదించ సరిదాననా
సెలవుల నవ్వేవు నీ చిత్తము కొలఁది గాక
మలసి నే మారునవ్వ మందెమేళమా
(॥అద్దో॥)
కొచ్చి కొచ్చి నీ వెంత కొంగువట్టి తీసినాను
పచ్చిదేరఁ బెనఁగ కోపపుదాననా
యెచ్చరించి సారె సారె నిక్కువ లంటేవు నీవు
గచ్చుల నేనూ నొరయఁ గండ గర్వమా
(॥అద్దో॥)
యిక్కువ శ్రీ వేంకటేశ యేలితివంటా నేను
నిక్కి యెమ్మె సేయ నీతో నీటుదాననా
మక్కువచేసి నన్ను మన్నించితివి రతుల
అక్కరతోఁ గొసరఁగ ఆసోదమా
(||pallavi||)
addo yĕkkaḍi suddi aṁtesi kobam̐galanā
gaddiṁcha nīdo nāgum̐ bĕddarigamā
(||addo||)
sĕlam̐gi nīvemi sesinām̐ jesidivi gāga
salamulu sādiṁcha saridānanā
sĕlavula navvevu nī sittamu kŏlam̐di gāga
malasi ne mārunavva maṁdĕmeḽamā
(||addo||)
kŏchchi kŏchchi nī vĕṁta kŏṁguvaṭṭi tīsinānu
pachchideram̐ bĕnam̐ga kobabudānanā
yĕchchariṁchi sārĕ sārĕ nikkuva laṁṭevu nīvu
gachchula nenū nŏrayam̐ gaṁḍa garvamā
(||addo||)
yikkuva śhrī veṁkaḍeśha yelidivaṁṭā nenu
nikki yĕmmĕ seya nīdo nīḍudānanā
makkuvasesi nannu manniṁchidivi radula
akkaradom̐ gŏsaram̐ga āsodamā