(॥పల్లవి॥)
అద్దో మానవుగా అదేమే నీవు
గద్దించి నీవు చూచితే కాళ్లు వణఁకీనా
(॥అద్దో॥)
మచ్చిక నాతఁడు నేడు మా యింటికి వచ్చె నంటా
పచ్చి గొంతా వెచ్చి గొంతాఁ బలికే వేమే
బచ్చెనల నతఁడు నీ సాంగెములో వాఁడై
నెచ్చెలి నీకుఁ గొంకితే నే నీకు వెరతునా
(॥అద్దో॥)
చెప్పి యిందరిలో వాఁడు చేయి నాపై వేసె నంటా
అప్పటనుండి వుడికే వ దేమే నీవు
దెప్పర మాతఁడు నీచేఁ దిట్టించుకొనుఁ గాక
నిప్పువంటిదాన నేను నీచేతఁ బడేనా
(॥అద్దో॥)
గక్కన శ్రీవెంకటాద్రిఘనుఁడు నన్నుఁ గూడితే
పక్కన నాతనిఁ గొంగు వట్టే వేమే
చక్క నీ వండ నుంటె సాదించఁ జెల్లుఁ గాక
యిక్కడ వచ్చే మనేవే యిక నే నోరుతునా
(||pallavi||)
addo mānavugā ademe nīvu
gaddiṁchi nīvu sūside kāḽlu vaṇam̐kīnā
(||addo||)
machchiga nādam̐ḍu neḍu mā yiṁṭigi vachchĕ naṁṭā
pachchi gŏṁtā vĕchchi gŏṁtām̐ balige veme
bachchĕnala nadam̐ḍu nī sāṁgĕmulo vām̐ḍai
nĕchchĕli nīgum̐ gŏṁkide ne nīgu vĕradunā
(||addo||)
sĕppi yiṁdarilo vām̐ḍu seyi nābai vesĕ naṁṭā
appaḍanuṁḍi vuḍige va deme nīvu
dĕppara mādam̐ḍu nīsem̐ diṭṭiṁchugŏnum̐ gāga
nippuvaṁṭidāna nenu nīsedam̐ baḍenā
(||addo||)
gakkana śhrīvĕṁkaḍādrighanum̐ḍu nannum̐ gūḍide
pakkana nādanim̐ gŏṁgu vaṭṭe veme
sakka nī vaṁḍa nuṁṭĕ sādiṁcham̐ jĕllum̐ gāga
yikkaḍa vachche maneve yiga ne norudunā