Addiraa voyayya nenamtavaamdanaa | voga

అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా । వొక
Language

(॥పల్లవి॥)
అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా । వొక-
కొద్ది నీ దాసుల సేవ కోరఁగలఁ గాక

(॥అద్ది॥)
హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాఁడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమపదాన కాసపడుటయు ద్రోహము
సొరిది నీ భండారము సొమ్ము గనక

(॥అద్ది॥)
పంచేంద్రియముల నేఁ బారఁదోలేవాఁడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నా విజ్ఞాన మది దలఁచవచ్చునా
నించి నీవు పాఁతినట్టి నిధాన మది

(॥అద్ది॥)
వొట్టి సంసారపుమోపు వోపననేవాఁడనా
వెట్టి మమ్ముఁ జేయించేటి వేడుక నీది
గట్టిగా శ్రీవేంకటేశ కదిసి నీ శరణంటి
ఱట్టుగ నేఁ జెప్పేనా మీఱఁగ నీ రహస్యము

(||pallavi||)
addirā voyayya nenaṁtavām̐ḍanā | vŏga-
kŏddi nī dāsula seva koram̐galam̐ gāga

(||addi||)
hari nīmāyalagu ne naḍḍamu sĕppevām̐ḍanā
aridaina dadiyu rāsājña ganaga
paramabadāna kāsabaḍuḍayu drohamu
sŏridi nī bhaṁḍāramu sŏmmu ganaga

(||addi||)
paṁcheṁdriyamula nem̐ bāram̐dolevām̐ḍanā
muṁchi nīvu vĕṭṭinaṭṭi mudra kardalu
aṁchala nā vijñāna madi dalam̐savachchunā
niṁchi nīvu pām̐tinaṭṭi nidhāna madi

(||addi||)
vŏṭṭi saṁsārabumobu vobananevām̐ḍanā
vĕṭṭi mammum̐ jeyiṁcheḍi veḍuga nīdi
gaṭṭigā śhrīveṁkaḍeśha kadisi nī śharaṇaṁṭi
ṟaṭṭuga nem̐ jĕppenā mīṟam̐ga nī rahasyamu