Addamuraamaidimani atte mammela doorevu

అడ్డమురామైతిమని అట్టె మమ్మేల దూరేవు
Language

(॥పల్లవి॥)
అడ్డమురామైతిమని అట్టె మమ్మేల దూరేవు
వెడ్డువెట్టి నవ్వఁగా నీవేడుకంటా నుంటిమి

(॥అడ్డ॥)
తివిరి యెందుండో వచ్చి తిట్లు నిన్నుఁ దిట్టఁగా
వువిద నీ దేవులంటా నొదిగుంటిమి
చెవిలో నేకతమాడి చేతఁ జెక్కు లదమఁగా
అవల నీకెతో(నీకేదో?) చుట్టమంటా నుంటిమి

(॥అడ్డ॥)
తొంగిచూచి నీసొమ్ములు తొడిఁబడఁ బెట్టుకోఁగా
అంగనేకర్తగాఁబోలునని వుంటిమి
చెంగటనుండి నీకొప్పు చేచేతఁదగిలించి
వంగఁదియ్యఁగా నీకు వదినంటా నుంటిమి

(॥అడ్డ॥)
శ్రీవేంకటేశ ఆపె చేరి పాదము దొక్కఁగా
సేవకురాలంటా పాన్పుచెంత నుంటిమి
భావించి నన్నేలితివి పట్టపలమేల్మంగను
ఆవనిత నిన్నంటగా ఆఁడుజెట్టెనుంటిమి

(||pallavi||)
aḍḍamurāmaidimani aṭṭĕ mammela dūrevu
vĕḍḍuvĕṭṭi navvam̐gā nīveḍugaṁṭā nuṁṭimi

(||aḍḍa||)
tiviri yĕṁduṁḍo vachchi tiṭlu ninnum̐ diṭṭam̐gā
vuvida nī devulaṁṭā nŏdiguṁṭimi
sĕvilo negadamāḍi sedam̐ jĕkku ladamam̐gā
avala nīgĕdo(nīgedo?) suṭṭamaṁṭā nuṁṭimi

(||aḍḍa||)
tŏṁgisūsi nīsŏmmulu tŏḍim̐baḍam̐ bĕṭṭugom̐gā
aṁganegardagām̐bolunani vuṁṭimi
sĕṁgaḍanuṁḍi nīgŏppu sesedam̐dagiliṁchi
vaṁgam̐diyyam̐gā nīgu vadinaṁṭā nuṁṭimi

(||aḍḍa||)
śhrīveṁkaḍeśha ābĕ seri pādamu dŏkkam̐gā
sevagurālaṁṭā pānpusĕṁta nuṁṭimi
bhāviṁchi nannelidivi paṭṭabalamelmaṁganu
āvanida ninnaṁṭagā ām̐ḍujĕṭṭĕnuṁṭimi