Addamarediri kaada naule taanu

అద్దమరేతిరి కాడ నౌలే తాను
Language

(॥పల్లవి॥)
అద్దమరేతిరి కాడ నౌలే తాను
అద్దో నీకింత చుట్టమాయఁబో తాను

(॥॥)
వీడెము చేతఁ బట్టుక వేళగాచుకొని వుండి
వాడికమాఁట లాడవచ్చెఁబో యీకె
వోడక వేఁడిచెమట నూనిన చేఁతఁ గానిక
తీఁడుకొంటా నిమ్మపండ్లు తెచ్చెఁబో నీకు

(॥॥)
దొరతనము సేసుక తోడువెట్టుక యీపొద్దు
వరుసకు నీతో నవ్వవచ్చెఁబో యీకె
గరిమఁ దననిట్టూర్పు గాలిచేఁ గడివోయిన
సురవొన్నలు సూడిదె చూపించెఁబో నీకు

(॥॥)
కలుపు కోలుఁదనాన కడుఁదమి రేఁచుకోంటా
వలపుల నిన్నుఁ గూడవచ్చెఁబో యీకె
యెలమి శ్రీవేంకటేశ యేనలమేలుమంగను
కలసితిఁ దానొకత గలిగెఁబో నీకు

(||pallavi||)
addamarediri kāḍa naule tānu
addo nīgiṁta suṭṭamāyam̐bo tānu

(||||)
vīḍĕmu sedam̐ baṭṭuga veḽagāsugŏni vuṁḍi
vāḍigamām̐ṭa lāḍavachchĕm̐bo yīgĕ
voḍaga vem̐ḍisĕmaḍa nūnina sem̐tam̐ gāniga
tīm̐ḍugŏṁṭā nimmabaṁḍlu tĕchchĕm̐bo nīgu

(||||)
dŏradanamu sesuga toḍuvĕṭṭuga yībŏddu
varusagu nīdo navvavachchĕm̐bo yīgĕ
garimam̐ dananiṭṭūrbu gālisem̐ gaḍivoyina
suravŏnnalu sūḍidĕ sūbiṁchĕm̐bo nīgu

(||||)
kalubu kolum̐danāna kaḍum̐dami rem̐sugoṁṭā
valabula ninnum̐ gūḍavachchĕm̐bo yīgĕ
yĕlami śhrīveṁkaḍeśha yenalamelumaṁganu
kalasidim̐ dānŏgada galigĕm̐bo nīgu