అద్దమరాతిరికాఁడ అలపు చూడక వచ్చె
(॥పల్లవి॥)
అద్దమరాతిరికాఁడ అలపు చూడక వచ్చె
వొద్దికతోఁ బీఁటపై గూచుండఁ బెట్టుకోవయ్యా
(॥అద్ద॥)
సారె జాఱుఁదురుముతో సతి నీ ఇంటికి రాఁగా
జీరల చెమటగారీఁ జెక్కులవెంట
చేరి సురటి విసరి చెంగలువలు ముడిచి
గారవించి పరపుపైఁ గాఁగిలించుకోవయ్యా
(॥అద్ద॥)
పయ్యదకొం గెడలఁగఁ బరువున రాఁగాను
కయ్యమడిచీఁ జన్నులు కదలఁగను
చెయ్యి వురమున మోపి చెంగావిదుప్పటి గప్పి
వుయ్యాలమంచము మీఁద వొద్దికచూపవయ్యా
(॥అద్ద॥)
గందపుబొట్టు కలసి నిన్నంటరాఁగా
చిందేటిమోవితేనెలు చిప్పిలీని
కందువ మోవి యాని కస్తూరి నుదుటఁ బూసి
పొందుల శ్రీవేంకటేశ పొసఁగించుకోవయ్యా
(||pallavi||)
addamarādirigām̐ḍa alabu sūḍaga vachchĕ
vŏddigadom̐ bīm̐ṭabai gūsuṁḍam̐ bĕṭṭugovayyā
(||adda||)
sārĕ jāṟum̐durumudo sadi nī iṁṭigi rām̐gā
jīrala sĕmaḍagārīm̐ jĕkkulavĕṁṭa
seri suraḍi visari sĕṁgaluvalu muḍisi
gāraviṁchi parabubaim̐ gām̐giliṁchugovayyā
(||adda||)
payyadagŏṁ gĕḍalam̐gam̐ baruvuna rām̐gānu
kayyamaḍisīm̐ jannulu kadalam̐ganu
sĕyyi vuramuna mobi sĕṁgāviduppaḍi gappi
vuyyālamaṁchamu mīm̐da vŏddigasūbavayyā
(||adda||)
gaṁdabubŏṭṭu kalasi ninnaṁṭarām̐gā
siṁdeḍimovidenĕlu sippilīni
kaṁduva movi yāni kastūri nuduḍam̐ būsi
pŏṁdula śhrīveṁkaḍeśha pŏsam̐giṁchugovayyā