Adda maadagu vamma nee vaadanidonu

అడ్డ మాడకు వమ్మ నీ వాతనితోను
Language

(॥పల్లవి॥)
అడ్డ మాడకు వమ్మ నీ వాతనితోను
వొడ్డార మతఁడు నీతో నొనరించీనా

(॥అడ్డ వడ॥)
మూలలకుఁ బోకు వమ్మ ముంచి యాతఁడు రాఁగాను
యీలాగు దొరచిత్త మెట్టుండునో
బాలకివి నీ విపుడు ప్రౌఢనాయకుఁ డతఁడు
తాలిమి నీయడకుఁ దప్పి నేసినా

(॥అడ్డ వడ॥)
సిగ్గులు వడకు వమ్మ చెనకి యాతనితోను
నిగ్గులమగవాఁడు యేనెప మొంచునో
అగ్గలపు మేనదాన వతఁడు మోహపువాఁడు
యెగ్గలు నీ కొనరించి యెలయించీనా

(॥అడ్డవడ॥)
పక్కన నవ్వకు మమ్మ పట్టి యాతఁడు గూడఁగ
యెక్కువ శ్రీవెంకటేశుఁ డెంత సేసునో
మిక్కిలి వాసికత్తెవు మించి వోరుచు నాతఁడు
వొక్క టైతి రిఁక నీపై నోల వేసీనా

(||pallavi||)
aḍḍa māḍagu vamma nī vādanidonu
vŏḍḍāra madam̐ḍu nīdo nŏnariṁchīnā

(||aḍḍa vaḍa||)
mūlalagum̐ bogu vamma muṁchi yādam̐ḍu rām̐gānu
yīlāgu dŏrasitta mĕṭṭuṁḍuno
bālagivi nī vibuḍu prauḍhanāyagum̐ ḍadam̐ḍu
tālimi nīyaḍagum̐ dappi nesinā

(||aḍḍa vaḍa||)
siggulu vaḍagu vamma sĕnagi yādanidonu
niggulamagavām̐ḍu yenĕba mŏṁchuno
aggalabu menadāna vadam̐ḍu mohabuvām̐ḍu
yĕggalu nī kŏnariṁchi yĕlayiṁchīnā

(||aḍḍavaḍa||)
pakkana navvagu mamma paṭṭi yādam̐ḍu gūḍam̐ga
yĕkkuva śhrīvĕṁkaḍeśhum̐ ḍĕṁta sesuno
mikkili vāsigattĕvu miṁchi vorusu nādam̐ḍu
vŏkka ṭaidi rim̐ka nībai nola vesīnā