Adavi semchedalamu amtesi neramu

అడవి చెంచెతలము అంతేసి నేరము
Language

(॥పల్లవి॥)
అడవి చెంచెతలము అంతేసి నేరము
నడుమ నీ గోపికను నవ్వకుండేరా

(॥అడ॥)
పచ్చికస్తూరి గమ్మెట్టు పారిటాకు చీరపట్టు
బచ్చెన పసిఁడి కాకిపైఁడి బొట్టు
వచ్చితివి వలచి మావాకిటికి నీవు నేఁడు
నచ్చులఁ బురసతులు నవ్వకుండేరా

(॥అడ॥)
చిన్ని పొదల మేడలు చిగురాకు గోడలు
మన్ను మెకములలోని మావాడలు
వున్నాఁడవు మావద్ద నొంటి చుట్టరికముల
నన్నే మెచ్చి నిన్నిందరు నవ్వకుండేరా

(॥ఆడ॥)
జుంటితేనె మాకూడు సొంపుమాఁకులు మాతోడు
పంట కోవిలపాట మా పలుకులీదు
వొంటరి శ్రీవేంకటేశ కూడితివి మమ్ము నేఁడు
నంటున గొల్లసతులు నవ్వకుండేరా

(||pallavi||)
aḍavi sĕṁchĕdalamu aṁtesi neramu
naḍuma nī gobiganu navvaguṁḍerā

(||aḍa||)
pachchigastūri gammĕṭṭu pāriḍāgu sīrabaṭṭu
bachchĕna pasim̐ḍi kāgibaim̐ḍi bŏṭṭu
vachchidivi valasi māvāgiḍigi nīvu nem̐ḍu
nachchulam̐ burasadulu navvaguṁḍerā

(||aḍa||)
sinni pŏdala meḍalu sigurāgu goḍalu
mannu mĕgamulaloni māvāḍalu
vunnām̐ḍavu māvadda nŏṁṭi suṭṭarigamula
nanne mĕchchi ninniṁdaru navvaguṁḍerā

(||āḍa||)
juṁṭidenĕ māgūḍu sŏṁpumām̐kulu mādoḍu
paṁṭa kovilabāḍa mā palugulīdu
vŏṁṭari śhrīveṁkaḍeśha kūḍidivi mammu nem̐ḍu
naṁṭuna gŏllasadulu navvaguṁḍerā