అదరిపాటున వచ్చి ఆయములంటీఁ దాను
(॥పల్లవి॥)
అదరిపాటున వచ్చి ఆయములంటీఁ దాను
వుదుటున ముందుముందె వుంగరము వెట్టెనా
(॥॥)
పువ్వుల వేసీ నూరకే పుప్పొడి చల్లీఁ దాను
చివ్వనఁ జుట్టరికముఁ జెప్పుమనవే
నవ్వులు నవ్వీ నింతలో నమ్మికలిచ్చీఁ గమ్మటి
మవ్వముగాఁ దొల్లి పెండ్లిమాట లాడించెనా
(॥॥)
కొంగువట్టీ నప్పటిని కుచములంటీ నిదివో
అంగిడిఁ బైడి ముడిచి అంపెనా నేఁడు
యెంగిలిపొత్తుకు వచ్చీ యేడనైనాఁ దమకించీ
అంగవించి సోబనపుటక్షత లిప్పించెనా
(॥॥)
తప్పక చూచీ నదివో తతిగొని పొందుసేసి
అప్పుడే పొంకవెట్టెనా అవునా తాను
కప్పి శ్రీ వేంకటేశుఁడు కందువఁదానె పెండ్లాడీ
చొప్పుగా నింతులచేత సోబనఁ బాడించెనా
(||pallavi||)
adaribāḍuna vachchi āyamulaṁṭīm̐ dānu
vuduḍuna muṁdumuṁdĕ vuṁgaramu vĕṭṭĕnā
(||||)
puvvula vesī nūrage puppŏḍi sallīm̐ dānu
sivvanam̐ juṭṭarigamum̐ jĕppumanave
navvulu navvī niṁtalo nammigalichchīm̐ gammaḍi
mavvamugām̐ dŏlli pĕṁḍlimāḍa lāḍiṁchĕnā
(||||)
kŏṁguvaṭṭī nappaḍini kusamulaṁṭī nidivo
aṁgiḍim̐ baiḍi muḍisi aṁpĕnā nem̐ḍu
yĕṁgilibŏttugu vachchī yeḍanainām̐ damagiṁchī
aṁgaviṁchi sobanabuḍakṣhada lippiṁchĕnā
(||||)
tappaga sūsī nadivo tadigŏni pŏṁdusesi
appuḍe pŏṁkavĕṭṭĕnā avunā tānu
kappi śhrī veṁkaḍeśhum̐ḍu kaṁduvam̐dānĕ pĕṁḍlāḍī
sŏppugā niṁtulaseda sobanam̐ bāḍiṁchĕnā