Adaree bedaree namtanamta

అదరీ బెదరీ నంతనంత
Language

(॥పల్లవి॥)
అదరీ బెదరీ నంతనంత
అదవదలై మాయామృగము

(॥అదరీ॥)
పొలసీ మలసీఁ బొదలీఁ గదలీ
నెలసీఁ బలుమారు నెలవులను
కలసీ మృగములఁ గ్రమ్మర బెదరీ
అలసీనటు మాయామృగము

(॥అదరీ॥)
దాఁగీ లోఁగీఁ దటుకన వెనుకకు
వీఁగీ నేఁగీ విసవిసనై
రేఁగీగతి వచరింపుచుఁ జూపుల
నాఁగీనదె మాయామృగము

(॥అదరీ॥)
వెంకటగిరి రఘువీర నీముందర
కొంకీఁ గొసరీఁ గొనగొనల
జంకెల బాణాసన బౌణంబున
సంకెలఁ బడె మాయామృగము

(||pallavi||)
adarī bĕdarī naṁtanaṁta
adavadalai māyāmṛgamu

(||adarī||)
pŏlasī malasīm̐ bŏdalīm̐ gadalī
nĕlasīm̐ balumāru nĕlavulanu
kalasī mṛgamulam̐ grammara bĕdarī
alasīnaḍu māyāmṛgamu

(||adarī||)
dām̐gī lom̐gīm̐ daḍugana vĕnugagu
vīm̐gī nem̐gī visavisanai
rem̐gīgadi vasariṁpusum̐ jūbula
nām̐gīnadĕ māyāmṛgamu

(||adarī||)
vĕṁkaḍagiri raghuvīra nīmuṁdara
kŏṁkīm̐ gŏsarīm̐ gŏnagŏnala
jaṁkĕla bāṇāsana bauṇaṁbuna
saṁkĕlam̐ baḍĕ māyāmṛgamu